`సీతారామం`, `బేబీ`, `తొలిప్రేమ` రీ రిలీజ్‌.. ప్రేమికులకు వాలెంటైన్స్ డే ట్రీట్‌.. పండగే పండగ

First Published | Feb 12, 2024, 9:43 PM IST

ఇటీవల కాలంలో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ ఊపందుకుంది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా కల్ట్ లవ్‌ స్టోరీస్‌ వెండితెరపై సందడి చేయబోతున్నాయి. ప్రేమికులకు ట్రీట్‌ ఇవ్వబోతున్నాయి. 
 

ప్రేమికుల రోజు అంటే లవర్స్ డేగా భావిస్తారు. ప్రేమలో ఉన్న వాళ్లు సెలబ్రేట్‌ చేసుకునే రోజుగా చెప్పొచ్చు. ఆ రోజు అనేక జంటలు కలుస్తాయి. మరికొన్ని జంటలు విడిపోతాయి. కానీ ఏదో ఒకటి తేలిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రేమికులకు వ్యాపారులు ఏదో కొత్త గిఫ్ట్ లతో ఎట్రాక్ట్ చేస్తుంటారు. సినిమా వాళ్లు కూడా ప్రేమికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. లవ్‌ స్టోరీ నేపథ్యంలో రూపొందిన కల్ట్ మూవీస్‌ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇటీవల రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో దాన్ని క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లవర్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వబోతున్నారు. 
 

ఈ వాలెంటైన్స్ డే సందర్బంగా ఇప్పుడు చాలా సినిమాలు రీ రిలీజ్‌ అవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవచ్చు `బేబీ`. గతేడాది వచ్చిన ఈ మూవీ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఓ ఊపు ఊపేసింది. వందకోట్లు వసూలు చేసి ట్రేడ్‌ వర్గాలకు షాకిచ్చింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి  చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ నటించగా, సాయి రాజేష్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బోల్డ్ కంటెంట్‌తో యూత్‌ని అలరించింది. ఇప్పుడు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేయబోతుంది. వాలెంటైన్స్ రోజు రీ రిలీజ్‌ అవుతుంది. 
 


దీంతోపాటు అదే రోజు మరో క్లాసికల్‌ మూవీ `సీతారామం` రిలీజ్‌ కానుంది. అదే రోజున ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ మూవీలో రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. లవ్‌ స్టోరీస్‌లో సరికొత్త ట్రెండ్‌ సృష్టించింది. పాటలు సినిమాకి మెయిన్‌ హైలైట్గా నిలిచాయి. 
 

Tholiprema

దీంతోపాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన క్లాసిక్‌ మూవీ `తొలి ప్రేమ`ని కూడా రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి 14నే ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఇందులో పవన్ కి జోడీగా కీర్తి రెడ్డి నటించగా, కరుణాకర్‌ దర్శకత్వం వహించారు. 1998లో ఈ మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది. ఇటీవల కూడా రీ రిలీజ్‌ అయ్యింది. మంచి ఆదరణే పొందింది.  

అలాగే ఇతర భాష చిత్రాలు కూడా రీ రిలీజ్‌ అవుతున్నాయి. సూర్య నటించిన `సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌` మూవీని కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇందులో సూర్య సరసన సిమ్రాన్‌ హీరోయిన్‌గా చేసింది. గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వం వహించారు. లవ్‌ స్టోరీస్‌లో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా చెప్పొచ్చు. 

వీటితోపాటు హిందీ మూవీ `దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే` మూవీ కూడా ప్రేమికుల రోజున విడుదల చేయబోతున్నారు. ఇందులో షారూఖ్‌ ఖాన్‌, కాజోల్‌ జంటగా నటించారు. బాలీవుడ్‌లో లవ్‌ స్టోరీస్‌లో ఇదొక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. అలాగే హాలీవుడ్‌లో లవ్‌ స్టోరీస్‌లో కల్ట్ క్లాసిక్‌ మూవీ `టైటానిక్‌`ని కూడా హైదరాబాద్‌ ప్రేమికుల రోజు విడుదల చేస్తుండటం విశేషం. ఇలా ఈ వాలెంటైన్స్ డే రోజున ప్రేమికులకు పండగే పండగ. 
 

Latest Videos

click me!