నా మనసు లోంచి మిమ్మల్ని చెరిపేయాలని మీరు ఇలా చేస్తున్నారని అర్థమైంది. మీ రూపం మారినంత మాత్రాన మిమ్మల్ని దూరం చేసుకుంటానని ఎలా అనుకున్నారు అని మనసులో అనుకుంటుంది వసుధార. మరోవైపు ఆఫీసులో ఉన్న జగతి తో నిన్ను, మహేంద్ర ని ఇలా చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. నిజం చెప్పే మహేంద్ర కి ఏదో సమస్య వస్తుందని నువ్వు నిజం చెప్పడం లేదని నాకు అర్థమైంది కనీసం నాకైనా నిజం చెప్పు అని బ్రతిమాలితాడు ఫణీంద్ర.