Guppedantha Manasu: తల్లి కొడుకుల పన్నాగానికి బలైన జగతి.. తల్లి ప్రవర్తనకి నిర్గాంత పోయిన రిషి?

Published : May 08, 2023, 10:22 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. అధికారం కోసం తమ్ముడు ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Guppedantha Manasu: తల్లి కొడుకుల పన్నాగానికి బలైన జగతి.. తల్లి ప్రవర్తనకి నిర్గాంత పోయిన రిషి?

 ఎపిసోడ్ ప్రారంభంలో ఇదంతా రిషి కి చెప్తాను అంటూ గదిలోంచి బయటికి వెళ్ళబోతున్న జగతిని ఆపి ఏంటి బెదిరిస్తున్నావా ఇప్పుడు మేం నీకు భయపడాలా అంటూ వెటకారంగా ఉంటుంది దేవయాని. నువ్వు చెప్తే వాడు నమ్ముతాడా అంటుంది. నమ్మకపోయినా చెప్తాను అంటూ జగతి వెళ్ళబోతుంటే రిషి చివరి క్షణాలు చూడ్డానికి వెళ్తున్నావా.. పదా నీతో పాటు మేము కూడా వస్తాము అంటాడు శైలేంద్ర.
 

28

 ఆ మాటలకి షాకవుతుంది జగతి. రిషి నీ మాటలు నమ్మడు నీ ఇంట్లోనే నువ్వు ఒక శరణార్థి లాగా బ్రతుకుతున్నావు అంటాడు శైలేంద్ర. బాగా చెప్పావు.. కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోలేని తల్లి ఈవిడ అంటుంది దేవయాని. తలుపు గడియ పెట్టి ఇప్పుడు మా గురించి అందరికీ నిజం చెప్పడం అవసరమా నీ కొడుకు ప్రాణాలతో ఉండటం అవసరమా అంటుంది దేవయాని. మీ ఇద్దరినీ ఏం చేసినా తప్పులేదు అంటుంది జగతి.
 

38

 నీకు ఈ గతి పట్టించిందే నేను. రిషి జీవితంలో నుంచి నిన్ను దూరం చేసి నేను పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు నువ్వు ఆ వసు వచ్చి కొత్త జీవితాన్ని చూపిస్తుంటే చూస్తూ ఊరుకోవటానికి మేమేమైనా పిచ్చివాళ్ళమా అంటుంది దేవయాని. పెంచిన ప్రేమలో కూడా స్వార్థం పెంచుకునే మీకు అమ్మ అనిపించుకునే అర్హత లేదు అంటుంది జగతి. ఇప్పుడు నువ్వు చెప్తే రిషి వింటాడా? విన్నాడే అనుకో ప్రాణాలతో ఉంటాడా అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర.
 

48

 నేను మీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను తీసుకోండి అంటూ నీ అంతట నువ్వే రిషి ని డిబిఎస్టి కాలేజీ ఎండి పోస్ట్ నుంచి తప్పుకునే లాగా చేయు. మోసం చేస్తావో బుజ్జగిస్తావో ఏడిపిస్తావు అదంతా నీ ఇష్టం. వాడు కాలేజీ పరిసర ప్రాంతాల్లో కనిపించకూడదు సాధ్యమైనంత త్వరగా ఈ పని చేయు ఇలా చేస్తేనే నీ కొడుక్కి ప్రాణ బిక్ష పెడతాను అంటాడు శైలేంద్ర.
 

58

నా కొడుకు ఎంత మంచి వరం ఇచ్చాడు.. స్వీకరించు అంటుంది దేవయాని. రిషి మీద నీకెందుకు ఇంత ద్వేషం అంటుంది జగతి. ఈ నీచులకి దుర్మార్గులకి ఎమోషన్స్ ఉండవు వాళ్లకి కావాల్సింది తగ్గించుకోవాలని మాత్రమే చూస్తారు టైం వేస్ట్ చేయకుండా వెళ్లి పని మొదలు పెట్టు అంటాడు శైలేంద్ర. ఇదంతా ఎందుకు కొడుకుని రక్షించుకొని ఆ వసుధారి కిచ్చి పెళ్లి చేసి ఎక్కడైనా హాయిగా బ్రతకండి. కాలేజీ మాత్రం నా కొడుక్కి ఇచ్చేయండి అప్పుడు మీ జోలికి వస్తే నన్ను అడుగు అంటుంది దేవయాని. అది రిషి డెవలప్ చేసుకున్న కాలేజీ అది రిషి సామ్రాజ్యం అంటుంది జగతి. 

68

దానికి రాజు నా కొడుకు కావాలి అంటుంది దేవయాని. నాకు కాలేజీ వెంటనే కావాలి దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నిజానికి నీకు థాంక్స్ చెప్పాలి పిన్ని నీ దగ్గర ఈ విషయం ఎలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను కానీ నువ్వే విని మా టైం ని సేవ్ చేసావు. ఇందాక రౌడీని చూసావు కదా పని లేక ఖాళీగా ఉన్నాడట నేను ఒక ఫోన్ కొడితే రిషి ని ఎప్పుడు ఎక్కడ లేపేస్తాడో వాడికే తెలియదు అంటూ బెదిరిస్తాడు శైలేంద్ర. ఇంత జరిగాక కూడా మా గురించి ఋషికి బాబాయ్ కి చెప్పాలని చూస్తే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.  వెళ్లండి..వెళ్లి పని మొదలు పెట్టండి అని జగతిని  పంపించేస్తాడు శైలేంద్ర.

78

మరోవైపు జగతి గదిలో లేకపోవడంతో వసు దగ్గరికి వెళ్లి అడుగుతాడు మహేంద్ర. ఇక్కడ లేరు సార్ రిషి సార్ దగ్గర ఉన్నారేమో అని  అనటంతో ఇద్దరు రిషి దగ్గరికి వెళ్తారు. అక్కడ కూడా ఆమె లేకపోవడం గమనించి జగతిని పని మీద బయటకు పంపించావా అని అడుగుతాడు మహేంద్ర. లేదు డాడ్ ఇంట్లోనే ఎక్కడో ఉండి ఉంటారు చూడండి అంటాడు రిషి.ఇల్లంతా వెతికాము ఎక్కడా లేదు అంటాడు మహేంద్ర. సరే అయితే మీరిద్దరూ టెర్రస్ మీద వెతకండి నేను కిందంతా వెతుకుతాను అనటంతో మహేంద్రవాళ్లు టెర్రస్ మీదకి వెళ్తారు. 

88

అక్కడ కుమిలి కుమిలి ఏడుస్తున్న జగతిని చూసి కంగారు పడతారు వసు, మహేంద్ర. ఏం జరిగింది నువ్వు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు కూడా ఇంతలా ఏడవలేదు కంగారు పడిపోతాడు మహేంద్ర. అంతలోనే రిషి అక్కడికి రావడంతో పరిగెత్తుకొని వెళ్లి రిషిని హత్తుకుని ఏడుస్తుంది జగతి. అనుకోని ఆ పరిణామానికి షాకవుతాడు రిషి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories