Guppedantha Manasu: రిషీ వసు ప్రేమ కోసం ఇంటి నుంచి వెళ్లిపోతున్న జగతి.. షాక్ లో మహేంద్ర!

First Published Sep 27, 2022, 9:26 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి జగతితో, ముఖ్యమైన బంధం అంటే నా వైపు నుంచే కాదు తన వైపు నుంచి కూడా ఉన్నది. ఇంక నిర్ణయం అంతా తన చేతుల్లోనే ఉన్నది తను తీసుకునే నిర్ణయం బట్టే మా బంధం ఉంటుందో లేదో తెలుస్తుంది అని అంటాడు రిషి. ఆ తర్వాత రోజు ఉదయాన్నే జగతి వసూ ఇంటికి వెళ్తుంది. అప్పుడు వసు నిద్రలేగిసి తలుపుతీస్తుంది.ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు మేడం అని వసు అడగగా, నీకు రిషికి మధ్య ఏమైంది? నాకు సరిగ్గా చెప్పు నేను రాత్రి నేను రిషితో మాట్లాడాను అని అనగా వసు, ఏం అవలేదు మేడం మేము బాగానే ఉన్నాము అని అంటుంది. 
 

అప్పుడు జగతి నిజం చెప్పు వసు ఏం జరిగింది అని అనగా జరిగిన విషయం అంత చెప్పి, ఇలాగా నాకు మూడు రోజులు గడివిచ్చారు అని చెప్తుంది వసు.అప్పుడు జగతి కోపం తో, నువ్వు తెలివైన దానివే కదా!నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు మా కోసం నీ బంధాన్ని వదులుకుంటున్నావా? రిషి నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్లేదు, నేను ఇప్పుడు బానే ఉన్నాను కదా నాకు అంతకుమించి ఆశలు కూడా లేవు.ఇప్పుడు నన్ను అమ్మ అని పిలిపించే అవసరం ఏమున్నది. దానికోసం నీ బంధాన్ని వదులుకుంటావా అని అనగా, నేను వినను మేడం నేను ఎందుకు బంధాన్ని వదులుకుంటాను మేడం.
 

రిషి సార్ నా ప్రాణం నేను ఎలాగ దూరం చేసుకోవాలనుకుంటాను. అలాగని మిమ్మల్ని కూడా అమ్మా అని పిలవనివ్వకుండా వదలను. ఎలాగైనా సార్ చేత అమ్మ అని పిలిపిస్తాను అని అంటుంది. దానికి జగతి,వాడు నా కొడుకు వసు తన గురించి నాకు తెలుసు కదా,వాడు మొండోడు అని అనగా, మీ కొడుకు కాబట్టే మారతారు అన్న నమ్మకం నాకున్నది మేడం. చంద్రుడు లాంటి రిషి సార్ దగ్గర నల్ల మచ్చ ఉండకూడదు అని అంటుంది వసు.అప్పుడు జగతి, ఇంకా ఎంత చెప్పినా నువ్వు వినవా అని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 
 

అప్పుడు వసు, ఎలాగైనా మిమ్మల్ని అమ్మ అని పిలిపిస్తాను మేడం మీ మా బాధ త్వరగా పోతుంది అని మనసులో అనుకుంటుంది. జగతి కోపం గా ఇంటికి వచ్చి లోపల బట్టలన్నీ సర్దుకుంటూ ఉంటుంది. జగతి కోపంగా లోపలికి వెళ్లడం రిషి చూసి, మేడం ఎక్కడికి వెళ్లారు కోపంగా ఉన్నట్టున్నారు అని అనుకుంటాడు. గదిలో ఉన్న మహేంద్ర ఎందుకు జగతి బట్టలు చదువుతున్నావు అని అడగగా, నేను ఇక్కడ ఉండను మహీంద్రా. నేను ఎక్కడికి వచ్చానో అక్కడికే వెళ్లిపోతాను. నాకు ఇవేవీ వద్దు అని అంటుంది జగతి. దానికి మహీంద్రా ఆశ్చర్యపోయి, ఇప్పుడు అక్కడికి వెళ్లడం జగతి. 
 

నువ్వు నేను రిషి ముగ్గురం కలిసి ఇంట్లో ఉందాము, జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్నాను కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని ఏడుస్తూ అనగా నా వల్ల రిషి, వసూలు విడిపోవడం నాకు ఇష్టం లేదు మహేంద్ర. వాళ్లకు ఇప్పుడు నా వల్ల సమస్యలు వస్తున్నాయి. అయినా నేను ముందు నుంచి ఇంట్లో లేను కదా మధ్యలో వచ్చిన దాన్ని మధ్యలోనే వెళ్లిపోతాను. ఇంక రిషి నీ జాగ్రత్తగా చూసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త. అయినా నేను ఉండడం వల్లే కదా దేవయాని వదిన కూడా రిషి ని ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు నుంచి నేను ఇక్కడ ఉండను.
 

ఎవరి జీవితంలోని నేను చెడుగా మిగిలిపోకూడదు అని బయటకు వెళ్తున్న సమయంలో రిషి అక్కడికి వస్తాడు.అంతా విన్నాను మేడం వెళ్లండి మీరు చిన్నప్పుడు ఎందుకు వెళ్లారో తెలియదు. అప్పుడు  ఒక్కడినే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు. నేను మిమ్మల్ని ఇంటికి అప్పుడు రమ్మన్నది కూడా మా డాడ్ ముఖంలో చిరునవ్వు ఉండాలి అని. ఎప్పుడూ మనస్ఫూర్తిగా నవ్వని డాడ్, మిమ్మల్ని చూసిన ప్రతిరోజు నవ్వుతూనే ఉన్నారు. మా డాడీని చూసి నేను ఆనందంగా ఉంటూనే ఉన్నాను. ఇప్పుడు మీరు వెళ్లిపోతే మళ్ళీ మా డాడ్ మనసులో మచ్చ ఉండిపోతుంది.
 

అయినా మీరు వెళ్ళిపోతేనే వసుధార నా లైఫ్ లోకి వస్తుందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆ వసుధార కి తెలివి, పట్టుదలతో పాటు పొగరు కూడా ఎక్కువే. మీకు మా డాడ్ అవసరం లేదు ఆ వసుధారకి నేను అవసరం లేదు. మీ పంతాలు, మీ పట్టింపులే మీకు కావాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే డాడ్ మొకంలో నవ్వు పోతుంది, డాడ్ మొకంలో నవ్వు పోతే నా మొఖంలో నవ్వు పోతుం.ది నేను సంతోషంగా ఉండకూడదనే వెళ్తున్నారు కదా వెళ్ళండి, అలాగే  డాడ్ నీ కూడా తీసుకొని వెళ్ళండి లేకపోతే మీ ఇద్దరిని విడదీసిన పాపం నాకెందుకు.లేకుండా బతకడం అలవాటు చేసుకున్న వాడిని తండ్రి లేకుండా బతకడం అలవాటు చేసుకోలేనా అని రిషి అక్కడి నుంచి తిరిగి వెళుతున్నప్పుడు దేవయాని అక్కడికి వస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని మనసులో అనుకున్న దేవయాని.

ఏంటి జగతి రిషి ని బాధపెట్టే పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? చిన్నప్పుడు నుంచి ఎప్పుడు రిషి ని బాధ పెట్టడం తప్ప నీకు ఇంకే విషయం తెలీదా!  అప్పుడెప్పుడో చిన్నప్పుడు కారణం చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయావు. రిషి మంచి మనిషి కాబట్టి ఇప్పటికీ కారణం అడగలేదు. అయినా నిన్ను ఇంట్లో ఉంచుకున్నాడు తీరా నువ్వు చేసేది ఇదా! మీ ఇద్దరి వల్ల ఇప్పుడు రిషి బాధపడుతున్నాడు. ఏంటి జగతి, ఇంటిలో నుంచి వెళ్ళిపోతున్నాను అని నాటకాలు ఆడి రిషి ని సాధిస్తే నీకేం వస్తుంది అని అంటుంది. అప్పుడు జగతికి కోపం వచ్చి, అక్కయ్య నాటకాలు ఆడటం ఏంటి అని గట్టిగా అంటుంది. అప్పుడు దేవయాని, ఇంకేం మాట్లాడొద్దు జగతి అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురుచూడాల్సిందే!

click me!