Guppedantha Manasu: తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన రిషిని చూసి తట్టుకోలేకపోయిన దేవయాని!

First Published Dec 7, 2021, 11:52 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

కమిషనర్ ఇంట్లో కార్తీకమాసం వన భోజన సందర్భంగా రిషి (Rishi) కుటుంబ సభ్యులందరూ అక్కడికి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక భోజనం చేయడం కోసం కొన్ని వస్తువుల కోసం రిషి, వసు (Vasu) ఆటోలో బయలుదేరి మళ్లీ వన భోజనం దగ్గరికి చేరుకుంటారు.
 

వారిద్దరిని అలా చూస్తూ జగతి (Jagathi) మురిసి పోతుంది.  మహేంద్ర వర్మ కూడా చూసి సంతోష పడతాడు. ఇక దేవయాని వాళ్ళని చూసి ఎక్కడికెళ్లినా వసు రిషిని (Rishi) వదలదని అనుకుంటుంది. ఇక భోజనాలు ఏర్పాటు జరుగుతుండగా అందరూ భోజనానికి కూర్చుంటారు.
 

వెంటనే కమిషనర్ తన పక్కన కలిసి భోజనం చేయటానికి రిషిని (Rishi) పిలుస్తాడు. అంతలోనే అక్కడికి జగతి రావటంతో జగతిని (Jagathi) పిలిచి రిషి పక్కన కూర్చోబెడతాడు. జగతి రిషి పక్కన కూర్చున్నందుకు  బాగా మురిసిపోతుంది.
 

మరోవైపు వీరిని చూస్తూ వసు (Vasu) కూడా సంతోషపడుతుంది. ఇక మహేంద్రవర్మ చూసి షాక్ లో ఉంటాడు. కమిషనర్ మహేంద్ర వర్మను (Mahendra) కూడా పిలవడంతో వెంటనే వెళ్లి అక్కడ కూర్చుంటాడు. ఇక వీరిని చూసి దేవయాని తట్టుకోలేకపోతుంది.
 

మొత్తానికి రిషి (Rishi) తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేస్తుండగా అంత మంచి సందర్భంను చూసి వసు వెంటనే ఫోటో దించాలని పుష్పకు చెబుతుంది. పుష్ప (Pushpa) ఫోటో తీస్తుండగా రిషి కోపంతో చూడటంతో వెళ్లి వసుకి ఇస్తుంది.
 

ఇక వసు (Vasu) వెళ్లి వారిని ఫోటో దింపుతుండగా మహేంద్ర వర్మ ఫోటోలకు తెగ ఫోజులు ఇస్తూ ఉంటాడు. జగతి (Jagathi) రిషి పక్కన ఫోటోలు దిగుతుంది. రిషి చూడటంతో పక్కన ఉన్న వాళ్లను దింపినట్లు చేస్తుంది. మొత్తానికి ఈ సన్నివేశం బాగా అద్భుతంగా ఉంటుంది.
 

భోజనాలు పూర్తయ్యాక కమిషనర్ అత్యవసర పని వల్ల వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఫణీంద్ర వర్మను, మహేంద్ర  వర్మ (Mahendra), రిషి (Rishi) వాళ్లకు వచ్చినందుకు థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు.
 

వసు (Vasu) అక్కడ మిగిలిన భోజనాలను అనాధ వాళ్లకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి అక్కడే ఉంటుంది. రిషి వసుధార వెళ్ళిపోయిందనునుకొని బాధ పడతాడు. వసు కూడా రిషి సర్ వెళ్లిపోయాడని అనుకుంటుంది. ఇక వసు, పుష్ప (Pushpa) అక్కడే ఉండగా వసు ఉయ్యాల ని చూసి అక్కడికి వెళ్లి రిషిని గుర్తుకు చేసుకుంటుంది.

click me!