Guppedantha Manasu: రిషి బాధను చూసి కుమిలిపోతున్న జగతి, మహేంద్ర.. ఆలోచనలో పడ్డ దేవయాని..?

Published : Nov 14, 2022, 09:34 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Guppedantha Manasu: రిషి బాధను చూసి కుమిలిపోతున్న జగతి, మహేంద్ర.. ఆలోచనలో పడ్డ దేవయాని..?

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,పెదనాన్న వచ్చి డాడ్ వాళ్ల గురించి అడిగితే నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావు అని పెదనాన్న ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలి వసుధార అని అంటాడు రిషి. అప్పుడు రిషి సార్ ని చాలా బాధపెడుతున్నారు మహేంద్ర సార్ మీరు అలా వెళ్లడం చాలా తప్పు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి కావాలనే వాళ్ళు నాకు కనపడకుండా ఎస్కేప్ అవుతున్నారు అని అనుకుంటూ ఉంటాడు రిషి. అంటే కోప్పడతావ్ ఏమో కానీ మీ మేడం కూడా చాలా కఠినంగా ఆలోచిస్తున్నారు వసుధార అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి.
 

26

 ఆ తర్వాత దేవయాని వాళ్ల పెదనాన్న ఏం చెప్పకపోయినా కూడా అని చెప్పినట్టుగా అబద్ధాలు చెప్పాను. ఇప్పుడు ఆయన వస్తున్నారు. వాళ్ళ పెదనాన్నను అడిగితే నేను ఏం చెప్పాలి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఉంటుంది దేవయాని. అప్పుడు దేవయాని ఈ కొంపలో ఏం జరిగినా ఉరుమురివి మంగళ మీద పడినట్టు అన్ని నా మీద పడతాయి అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే ధరణి అక్కడికి కాఫీ తీసుకొని వస్తుంది. ఇప్పుడు ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే దేవయాని ఈ జగతి వాళ్లు ఎక్కడికి వెళ్లి ఉంటారు ధరణి అని అనడంతో నాకేం తెలుస్తుంది అత్తయ్య గారు అని అంటుంది.
 

36

 అప్పుడు దేవయాని వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి ధరణి అని అంటుంది. మరొకవైపు జగతి వసుధార గురించి ఆలోచిస్తూ వసుధార నువ్వు నా గురించి ఆలోచించి రిషికి దూరం కావొద్దు అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మహేంద్ర వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అనడంతో నాకు ఆలోచించడానికి ఏముంటుంది మహేంద్ర వసుధార,రిషి ల గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది. అప్పుడు మహేంద్ర మనం ఒకటి అనుకోని ఇక్కడికి వచ్చాము అది జరిగే వరకు ఇక్కడ ఉండాల్సిందే జగతి అని అంటాడు. ఇంతలోనే వసుధార రిషి అక్కడికి రావడంతో వెంటనే మహేంద్ర గౌతమ్ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పి లోపలికి వెళ్లి దాక్కుంటారు. అప్పుడు రిషి వాళ్ళు లోపలికి వచ్చి గౌతమ్ కోసం వెతుకుతూ ఉంటారు.
 

46

అప్పుడు రిషి జగతి వాళ్ళ దాక్కున్న రూమ్ కి వెళ్లి గౌతమ్ కోసం వెతుకుతూ ఉండగా కనిపించకపోయేసరికి గౌతమ్ కి కాల్ చేస్తారు. ఇంతలోనే గౌతమ్ అక్కడికి రావడంతో జగతి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు గౌతమ్ అక్కడికి రావడంతో గౌతమ్ వెళ్దాం పద పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అని అంటాడు. అప్పుడు రిషి డాడ్ వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనడంతో జగతి దంపతులు షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్ ఇది మన ఫ్యామిలీ మేటర్ అనడంతో ఆపుతావా అని రిషి కోప్పడతాడు.
 

56

పెదనాన్న వస్తున్నాడు రా అని అనడంతో వెంటనే గౌతమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎలా అయినా కనుక్కుంటారు అప్పుడు నేను ఇరుకుంటాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార సార్  మహేంద్ర సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రిషి సార్ ఎంత బాధ పడుతున్నారో నాకు మాత్రమే తెలుసు. గంటకొకసారి మహేందర్ సార్ కి ఫోన్ చేయడం పదేపదే మెయిల్ తో చెక్ చేసుకోవడం ఎవరి కారు సౌండ్ వినిపించినా మహేంద్ర సార్ వాళ్ళు అనుకోవడం ఇలా ఎంతో బాధపడుతున్నారు సార్ అనడంతో జగతి దంపతులు బాధపడతారు. ఇప్పుడు రిషి వెళ్దాం పద అనడంతో గౌతమ్ వద్దు అనడంతో వెంటనే రిషి నీకు అర్థం కావడం లేదు రా  రోజు రోజుకి నా గుండె బరువెక్కి పోతుంది అని అంటాడు రిషి.
 

66

 అప్పుడు గౌతమ్ మీద అనుమానపడిన రిషి నీకు తెలుసా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనడంతో గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు.. ఇప్పుడు గౌతమ్ ఏం లేదురా పెదనాన్న వస్తున్నాడు అని అంకుల్ కి మెయిల్ చెయ్ అని చెబుతాడు. ఆ తర్వాత రిషి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్లీ అక్కడికి వచ్చి గౌతమ్ కి స్వారీ చెప్పి నా మనసు ఏం బాగోలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర దంపతులు జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి ఇప్పటివరకు జరిగింది చాలు మహేంద్ర మనం అక్కడికి వెళ్లి పోదాం అని అంటుంది. అన్ని ఆపేసి వెళ్లిపోదాం పద అని జగతి అనడంతో వెంటనే మహేంద్ర వద్దు జగతి కాస్త ఓపిక అవసరం అనటంతో జగతి మాత్రం వెళ్దాం అని అంటుంది. అప్పుడు గౌతమ్ అవును అంకుల్ మేడం చెప్పేది నిజమే అని అనడంతో గౌతమ్ మీద కోప్పడతాడు మహేంద్ర.

click me!

Recommended Stories