ఏం చేస్తున్నా మోనిత ఆవిడని చంపేస్తావా అనగా అవును కార్తీక్ నీకు నాకు మధ్య ఎవరు వచ్చినా చంపేస్తాను అనటంతో దీప షాక్ అవుతుంది. అప్పుడు అది కార్తీక్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు అర్థం అవుతుందా అని అనగా మరి నువ్వు ఆ దీపతో కలిసి ఎందుకు దీపాలు వెలిగించావు అనడంతో వెంటనే కార్తీక్ నిన్న డబ్బులు ఇచ్చావు అలాగే నేను కూడా ఈరోజు పూజలో హెల్ప్ చేశాను అని అంటాడు. నువ్వు నాతో పాటు గుడికి వచ్చావు కార్తీక్ నాతో కలిసి దీపాలు వెలిగించకుండా ఈ వంటలక్క దీపాలు వెలిగించావు అని అందరి ముందు కార్తీక్ మీద సీరియస్ అవుతుంది మోనిత. ఇప్పుడు మోనిత కార్తీక్,దీప గురించి నోటికి వచ్చిన విధంగా వాగడంతో దీప గుడిలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇస్తుంది.