జగపతి బాబు పై కుట్రలు చేసింది ఎవరు? అల్లుడిని కేసులో ఇరికించాలని చూసినవారికి స్టార్ హీరో మాస్ వార్నింగ్

Published : Oct 02, 2025, 01:43 PM IST

ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు పెళ్లి గురించి ఆయన చెప్పిన సంచలన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

PREV
14
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో

టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జగపతి బాబు. ఆయన సినిమాలంటే ఇంట్లో అమ్మ, అక్కడ,వదినల దగ్గర నుంచి భామ్మల వరకూ అందరు ఇష్టపడేవారు. అంతే కాదు యూత్ లో కూడా జగపతి బాబుకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆయన హెయిర్ స్టైల్ అంటే చాలామంది ఇష్టపడేవారు. చాలా కాలం హీరోగా వరుస హిట్లు కొట్టిన ఈ నటుడు.. ఆతరువాత కాలంలో విలన్ గా అలరించాడు. హీరోగా ఆయన సాధించిన ఇమేజ్ కంటే విలన్ గానే ఎక్కువ ఇమేజ్ ను సాధించారు జగపతి బాబు. ఇక ప్రస్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి రోల్స్ చేస్తూ అద‌ర‌గొడుతున్నాడు.

24
విలన్ గా అదరగొడుతున్న హీరో

ముఖ్యంగా విల‌న్‌గా జ‌గ‌ప‌తిబాబు డిఫరెంట్ షేడ్స్ చూపిస్తున్నాడు. .ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో వెంటనే ప్రతినాయకుడిగా మారిన జ‌గ‌ప‌తి బాబు అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు. జ‌గ‌ప‌తి బాబు ఏది మాట్లాడిన ముక్కుసూటిగా మాట్లాడేస్తాడు. రీసెంట్‌గా ఆయన ఓ టాక్ షోను కూడా నిర్వహిస్తున్నారు. జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అది ప్లే అవుతోంది. ఇక గతంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెద్ద కూతురికి పెళ్లి గురించి జగపతి బాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

34
ఫారెన్ వ్యక్తితో పెద్ద కూతురు పెళ్లి

జగపతి బాబు పెద్ద కూతురు ఓ ఫారెనర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో చాలా కాంట్రవర్సీలు జరిగాయి. మరీ ముఖ్యంగా కుల పరంగా కొన్ని సమస్యలు ఫేస్ చేశానని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఆమె పెళ్లి చేసి తప్పుచేశానని ,రెండో అమ్మాయికి పెళ్లి చేయనని సంచ‌ల‌న కామెంట్ చేశారు.జ‌గ‌ప‌తిబాబుకి ఇద్ద‌రు అమ్మాయిలు కాగా, పెద్ద కూతురుని అమెరికాకి చెందిన వ్య‌క్తిని ఇచ్చి పెళ్లి చేశాడు. అమెరికా వ్య‌క్తిని అత‌ని కూతురు ఇష్ట‌ప‌డితే వెంట‌నే అత‌నికి ఇచ్చి వివాహం చేశాడు, అంతే కాదు పెద్ద కుమార్తె నాకు పిల్లలు వద్దు ఎవరినైన దత్తత తీసుకుని పెంచుకుంటాను అంటే దానికి కూడా ఓకే చెప్పార‌ట జ‌గ‌ప‌తి బాబు. పిల్ల‌ల‌కి పెళ్లి చేశాక వారిపై తల్లిదండ్రులకు ఎలాంటి హక్కులు, బాధ్యతలు ఉండవని జగపతి బాబు అన్నారు.

44
వివాదంగా మారిన వివాహం

తన పెద్ద కూతురు పెళ్లి వివాదం అయ్యిందని ఆయన అన్నారు. మా కులం వాళ్లు ఆ పెళ్లిని వ్యతిరకేకించారు. ఒకరైతే అలా పెళ్లి చేస్తున్నందకు చాలా రభస చేశారు. పెళ్లిని ఆపాలని ప్రయత్నం కూడా చేశారు. అంతే కాదు చాలా పలుకుబడి ఉపయోగించి, ఫారెన్ లో ఉన్న నా అల్లుడిని మారకద్రవ్యాల కేసులో ఇరికించాలని కూడా ప్రయత్నం చేశారు. అప్పుడు వారితో.. ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండిరా బాబు, మీరు బానే ఇరికిస్తారు.. ఆతరువాత వాడిని బయటకు తీసుకురాలేక నేను జీవితాంత ఇబ్బంది పడాలి అని అన్నారు. పెద్దమ్మాయి పెళ్లికి ఇంత జరిగింది అని జగపతి బాబు అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories