Mahatma Gandhi Roles: మొదటగా గాంధీజీ పాత్రలో నటించిందెవరో తెలుసా.. బాపుగా మెరిసిన స్టార్స్ వీరే

Published : Oct 02, 2025, 12:48 PM IST

Mahatma Gandhi Roles: ఈ రోజు దసరా పండుగ మాత్రమే కాదు, మహాత్మ గాంధీ జయంతి కూడా. ఈ సందర్భంగా సినిమాల్లో గాంధీజీ పాత్ర పోషించిన స్లార్స్ ఎవరో తెలుసుకుందాం. 

PREV
19
సినిమాల్లో గాంధీజీ పాత్రలతో అలరించిన స్టార్స్ వీరే

నేడు గురువారం(అక్టోబర్‌ 2) గాంధీ జయంతి. మనకు శాంతి మార్గంలో స్వాతంత్య్రం తీసుకురావడంతో కీలక పాత్ర పోషించిన నాయకుడు గాంధీ. ఇండిపెండెన్స్ డేకి ప్రతీకగా ఆయన్ని మనం జాతిపితగా పిలుస్తూ గౌరవించుకుంటాం.  అయితే నేడు ఓ వైపు దసరా పండగా, మరోవైపు గాంధీ జయంతి. నాన్‌ వెజ్‌ ద్వారా పండగని సెలబ్రేట్‌ చేసుకోవాలా? లేక గాంధీ జయంతి సందర్భంగా వాటికి దూరంగా ఉండాలా అనేది ప్రజల్లో నెలకొన్న కన్‌ఫ్యూజన్. ఈ క్రమంలో గాంధీజీకి వినోదానికి ఉన్న సంబంధం ఏంటనేది చూస్తే, ఆయన జీవితం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వెండితెరపై చాలా మంది నటులు గాంధీజీగా నటించి మెప్పించారు. మరి అలా అబ్బురపరిచిన ఆ నటులు ఎవరనేది తెలుసుకుందాం.  

29
జె.ఎస్. కశ్యప్

తెరపై మొట్టమొదట మహాత్మా గాంధీ పాత్రను జె.ఎస్. కశ్యప్ పోషించారు. ఆయన 1963లో వచ్చిన 'నైన్ అవర్స్ టు రామా' చిత్రంలో బాపుగా కనిపించారు. ఈ సినిమా స్టాన్లీ వోల్పర్ట్ రాసిన అదే పేరు గల నవల ఆధారంగా రూపొందించిన కల్పిత కథ.  బ్రిటీష్‌, అమెరికన్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి మార్క్ రాబ్సన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇందులో గాంధీగా జె ఎస్‌ కశ్యప్‌ జీవించారు. 

39
రజిత్ కపూర్

రజిత్ కపూర్ 1996లో వచ్చిన 'ది మేకింగ్ ఆఫ్ ది మహాత్మా' సినిమాలో బాపు పాత్ర పోషించారు. ఈ సినిమా గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన తొలి నాళ్ల ఆధారంగా తెరకెక్కింది. రజిత్ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.  శ్యామ్‌ బెనెగల్‌ రూపొందించిన ఈ చిత్రం అప్పట్లో మంచి ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది. 

49
బెన్ కింగ్స్ లే

గాంధీజీ జీవితం ఆధారంగా 1982లో వచ్చి సంచలన విజయం సాధించిన మూవీ `గాంధీ`. హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్ లే  'గాంధీ' సినిమాలో గాంధీజీ పాత్ర పోషించారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన ఈ సినిమా ప్రపంచాన్ని షేక్‌ చేసింది. ఏకంగా 8 ఆస్కార్‌ పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో బాపు జీవితంలోని ప్రతి క్షణాన్ని చూపించారు. బెన్  కింగ్స్ లే బాపుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు.  

59
నసీరుద్దీన్ షా

నసీరుద్దీన్ షా 'హే రామ్' సినిమాలో గాంధీజీ పాత్ర పోషించారు. ఈ చిత్రంలో బాపు హత్యకు సంబంధించిన అన్ని కోణాలను చూపించారు. ఈ సినిమా 2000లో విడుదలైంది. ఇందులో కమల్‌ హాసన్, షారూఖ్‌ ఖాన్‌, హేమా మాలిని, రాణి ముఖర్జీ వంటి భారీ తారాగణం నటించింది. ఈ చిత్రం సైతం మన ఇండియాలో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.  ఇది మూడు జాతీయ అవార్డులను అందుకుంది. 

69
దిలీప్ ప్రభావల్కర్

సంజయ్ దత్ హీరోగా నటించిన 'లగే రహో మున్నాభాయ్'లో దిలీప్ ప్రభావల్కర్ గాంధీజీ పాత్ర పోషించారు. 2006లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో గాంధీజీ ఇచ్చిన బోధనలను అద్భుతంగా చూపించారు. ఇదే సినిమాని 2007లో చిరంజీవి హీరోగా తెలుగులో రూపొందింది. ఇందులోనూ గాంధీజీగా దిలీప్‌ ప్రభావల్కర్‌ నటించారు. అదరగొట్టారు. ఇక్కడ కూడా ఈ మూవీ మంచి ఆదరణ పొందింది. గాంధీజీ పాత్ర దిలీప్‌ అదరగొట్టారు. పాత్రకి జీవం పోశారు.

79
దర్శన్ జరివాలా

'గాంధీ: మై ఫాదర్' సినిమాలో దర్శన్ జరివాలా మహాత్మా గాంధీ పాత్ర పోషించారు. ఆయన ఈ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. 2007లో వచ్చిన ఈ సినిమాలో గాంధీజీ, ఆయన కొడుకు మధ్య సంబంధాలను అద్భుతంగా చూపించారు. ఫీరోజ్‌ అబ్బాస్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ బాలీవుడ్‌ మూవీ అంతగా ఆడలేదు. ఇందులో గాంధీ పాత్ర రియాలిటీకి దూరంగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. 

89
దీపక్ అంటాని

'గాంధీ గాడ్సే ఏక్ యుధ్' సినిమాలో దీపక్ అంటాని బాపు పాత్ర పోషించారు. ఆద్యంతం కట్టిపడేశారు. 2023లో వచ్చిన ఈ సినిమా ఒక కల్పిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో గాంధీజీ బతికి, నాథూరామ్ గాడ్సేను క్షమించినట్లు చూపించారు. ఈ బాలీవుడ్‌ చిత్రానికి రాజ్‌ కుమార్‌ సంతోషి దర్శకత్వం వహించారు. గాంధీ పాత్రలో దీపక్‌ అంటాని తన పరిధి మేరకు బాగా చేశారు. కాకపోతే గాంధీలా బాగా సెట్ అయ్యారు. 

99
అవిజిత్ దత్

2011లో వచ్చిన 'డియర్ ఫ్రెండ్ హిట్లర్' (భారత్‌లో 'గాంధీ టు హిట్లర్' పేరుతో విడుదలైంది)లో అవిజిత్ దత్ బాపు పాత్ర పోషించారు. ఇది ఒక యుద్ధ డ్రామా సినిమా, దీనికి పెద్దగా స్పందన రాలేదు. దీనికి రాకేష్‌ రంజన్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో గాంధీ పాత్రలో అవిజిత్‌ అంతగా ఒదగలేకపోయారు. ఆడియెన్స్ కి  కనెక్ట్ కాలేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories