ఈ ఇంటర్వ్యూలో తను పోగొట్టుకున్న ఆస్తులపై జగపతిబాబు మొదటిసారిగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా ఆస్తి క్యాసినో, పేకాటతో పేలేదు. వేరే వాళ్లు దోపిడి చేశారని కూడా అనను. డబ్బుల విషయంలో లెక్కలేకపోవడం, జాగ్రత్తగా ఉండకపోవడం మూలంగా అలాంటి పరిస్థితి వచ్చింది. నాకు డబ్బు విషయంలో అయితే జీరో నాలెడ్జ్.