కొన్నేండ్ల పాటు సౌత్ హీరోయిన్ గా ఉపూపింది సీనియర్ నటి సదా. అయితే నాలుగేండ్లుగా సినిమాలకు దూరంగానే ఉన్న ఈ భామ.. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో తెగ సందడి చేస్తున్నారు. అదిరిపోయే అవుట్ ఫిట్స్, ట్రెడిషనల్, ట్రెండీ వేర్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా సదా ట్రెడిషనల్ లుక్ లో మెరిశారు. సీనియర్ బ్యూటీ అందాల విందుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా చూపుతిప్పుకోవడం లేదు. దీంతో ఆ బ్యూటీఫుల్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్ పిక్స్ లో సదా బ్లూ లెహంగా, అట్రాక్టివ్ ఎంబ్రాయిండింగ్ గల బ్లౌజ్ లో దర్శనమిచ్చారు. అప్పటికే మెరిసిపోయే స్కిట్ టోన్ పై సంప్రదాయ దుస్తులు మరింతగా షైన్ అవుతున్నాయి. దీంతో చూపు తిప్పుకోలేని అందాన్ని సొంతం చేసుకున్నారు.
ట్రెడిషనల్ లుక్ లో సదా ఎప్పుడూ బ్యూటీఫుల్ గానే ఉంటారనే విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరింత యంగ్ గా కనిపించేందుకు లెహంగాలో దర్శనమిస్తూ అందాల విందు చేస్తున్నారు. మతిపోయే పోజులతో కట్టిపడేస్తున్నారు.
అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘బీబీజోడీ’ డాన్స్ షో కోసం సదా ఇలా ముస్తాబయ్యారు. బ్లూ ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంటున్నారు. BBjodi షోకు జడ్జీగా వ్యవహరిస్తుండటంతో ప్రతి సీజన్ లో ఆకట్టుకునే దుస్తుల్లో మెరుస్తున్నారు.
కింగ్, నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ కంటెస్టెంట్లు ఈషోలో జోడీగా పెర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. సదా జడ్జీగా తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.
సదా చివరిగా ‘హాలో వరల్డ్’ వెబ్ సిరీస్ తో అలరించారు. గతేడాది ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందుకోసం నెట్టింట ఎప్పుడూ సందడి చేస్తున్నారు.