పాపులర్ కామెడీ షోతో ‘జబర్దస్త్’ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ బ్యూటీ వర్ష. తన అందం, చలాకీ తనంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా షోలో బ్యూటీఫుల్ యాక్ట్రెస్ గానూ పేరు దక్కించుకుంది.
తొలుత హైపర్ ఆది స్కిట్లలో నటించి టీవీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. బుల్లితెరపై అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ ను దక్కించుకుందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ పండించింది. అప్పటి నుంచి ఫాలోయింగ్ ను పెంచుకుంటూనే వస్తోంది.
మరోవైపు, సోషల్ మీడియాలోనూ వర్ష చురుకుగా ఉంటోంది. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు నిత్యం పోస్టులు పెడుతూనే ఉంటుంది. దీనికి తోడు అదిరిపోయే అవుట్ ఫిట్లలోనూ దర్శనమిస్తూ కుర్ర గుండెల్ని పేల్చేస్తోంది.
ఇప్పటికే బుల్లితెరపైన స్పెషల్ ఈవెంట్లలో గ్లామర్ ఒళకబోస్తున్న వర్ష.. ఇటు సోషల్ మీడియాలోనూ అందాల విందు చేస్తోంది. ఈ సందర్భంగా కండ్లు చెదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను ఫాలోవర్స్, నెటిజన్లతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది.
సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా నిన్న ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన వర్ష.. తాజాగా మోడ్రన్ లుక్ లో దర్శనమిచ్చి మతులు పోగొడుతోంది. ఇటు సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేస్తూనే.. అటు ట్రెండీ అవుట్ ఫిట్స్ లో గ్లామర్ షో చేస్తోంది.
తాజాగా వర్ష పంచుకున్న ఫొటోల్లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లూ డెనిమ్ జంప్ సూట్, టాప్ ధరించిన వర్ష కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. నన్ గ్లాసెస్ పెట్టుకొని, లూస్ హెయిర్ లో హోయలు పోయింది. ఈ సందర్భంగా స్టన్నింగ్ ఫొటోలకు పోజులిచ్చింది.
అదేవిధంగా.. హాట్ నెస్ లో ఏమాత్రం తగ్గలేదీ బ్యూటీ. చేతులు పైకెత్తి నడుము అందాలను చూపిస్తూ టెంప్ట్ చేసేలా కొన్ని స్టిల్స్ ఇచ్చింది. మత్తు చూపులతో మైమరిపించింది. మరిన్ని చిలిపి పోజులతో కుర్రాళ్లను కట్టిపడేసింది.
దీంతో ఫాలోవర్స్, నెటిజన్లు ఈ బ్యూటీ స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. ట్రెండీ ఫిట్ లో అదరగొట్టావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఆమె బ్యూటీని వర్ణిస్తూ హాట్ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏదేమైనా వర్ష లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.