సీతని తెమ్మంటే పీతని తెచ్చారు, రమ్యకృష్ణని అవమానించిన స్టార్‌ డైరెక్టర్‌, అయితేనేం ఆయనే డేట్‌ కోసం వెయిటింగ్‌

Published : Mar 18, 2025, 01:01 PM ISTUpdated : Mar 18, 2025, 02:15 PM IST

Ramya Krishnan : రమ్యకృష్ణ తెలుగుకి పరిచయం చేసిన సినిమా `కంచు కాగడ`. కానీ ఆమె సైన్‌ చేసిన మూవీ వేరే ఉంది. అదేంటి? ఆ సమయంలో డైరెక్టర్‌ ఎలా అవమానించాడో తెలుసుకుందాం. 

PREV
16
సీతని తెమ్మంటే పీతని తెచ్చారు, రమ్యకృష్ణని అవమానించిన స్టార్‌ డైరెక్టర్‌, అయితేనేం ఆయనే డేట్‌ కోసం వెయిటింగ్‌
ramya krishnan

Ramya Krishnan : రమ్యకృష్ణ.. `బాహుబలి`కి ముందు `బాహబలి`కి తర్వాత అనేలా మారిపోయింది. శివగామిగా ఆమె వేరే లెవల్‌ యాక్షన్‌ చూపించింది. ఇప్పుడు రమ్యకృష్ణని చూసే కోణమే మారిపోయింది. సరైన రోల్‌ పడితే తాను ఎంతగా రెచ్చిపోతుందో చూపించింది. అయితే రమ్యకృష్ణకి తెలుగులో తొలి సినిమాతోనే అవమానం జరిగింది. మరి అదేంటో చూద్దాం. 

26
ramya krishnan

రమ్యకృష్ణ కోలీవుడ్‌లో నటిగా పరిచయమై తెలుగులోకి వచ్చింది. 1983లో ఆమె కోలీవుడ్‌లో పరిచయం కాగా, తెలుగులోకి ఏడాది తర్వాత `కంచు కాగడ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది.  కానీ ఆమె మొదట కమిట్‌ అయిన మూవీ మాత్రం `కృష్ణలీల`. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఎన్టీఆర్‌ తమ్ముడు త్రివిక్రమ రావు నిర్మాత. ఆయన కొడుకే కళ్యాణ చక్రవర్తి. ఆయన్ని హీరోగా పెట్టి ఈ మూవీ తీశారు. 

36
krishna leela

త్రివిక్రమ రావు, ఆయన స్నేహితుడు నాగేశ్వరరావు కలిసి నిర్మించారు. ఇది హిందీలో ఓ మూవీకి రీమేక్‌. ఈ సినిమా సెలక్షన్‌ సమయంలో సీత పాత్ర కోసం హీరోయిన్ల అన్వేషణ జరుగుతుంది. ఆ బాధత్యలు అప్పట్లో లిరిక్‌ రైటర్‌ కనగాల జయకుమార్‌కి అప్పగించారు. ఆయన ఓ మూవీ షూటింగ్‌లో రమ్యకృష్ణని చూశారు. చూడగానే భలే అనిపించింది. దీంతో ఆమెని తీసుకొని వెళ్లి రవిరాజా పినిశెట్టికి చూపించారు. 

46
jayakumar

రమ్యకృష్ణని చూడగానే రవిరాజా పినిశెట్టి అన్న మాట.. `సీతని తెమ్మంటే పీతని తెచ్చావ్‌` అంటూ మండిపడ్డాడట. కానీ రమ్యకృష్ణ నిర్మాతలకు నచ్చింది. దీంతో రవిరాజాని కన్విన్స్ చేశారు. ఎట్టకేలకు ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అలా తెలుగులో రమ్యకృష్ణ ఫస్ట్ సైన్‌ చేసిన మూవీ `కృష్ణ లీల`. ఇందులో లీల పాత్రలో కళ్యాణ్‌ చక్రవర్తికి జోడిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
 

56
ramya krishnan

ఈ సినిమాలో విలన్‌ పాత్ర కోసం మోహన్‌బాబుని ఎంపిక చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేసి ఉన్నాడు, విలన్‌గా కూడా చేస్తున్నాడట. ఇందులోనూ అలాంటి పాత్రనే. మొదట నో చెప్పినా, తర్వాత చేశాడట. సినిమా షూటింగ్‌ సాగిందని, దీంతో రిలీజ్‌ లేట్‌ అయ్యింది. కమిట్‌ అయిన మూడేళ్ల తర్వాత ఈ మూవీ విడుదలైంది. రమ్యకృష్ణకి మంచి పేరు తెచ్చింది. 
 

66
ramya krishnan

అలా కనగాల జయకుమార్‌.. రమ్యకృష్ణని తెలుగుకి పరిచయం చేసిన క్రెడిట్‌ సంపాదించుకున్నాడు. రవిరాజ పినిశెట్టి ఆ రోజు అన్నమాటకి చాలా బాధపడిన రమ్యకృష్ణ తన నటనతో, గ్లామర్‌తో మెప్పించింది. మళ్లీ ఆయన వరుసగా తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకునేలా చేసింది. తన డేట్స్ కోసం వెయిట్‌ చేసేలా చేసిందట. 

read  more: 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. పొలిటికల్‌గా సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్

also read: 20ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో చిరు.. మరో క్రేజీ భామ పేరు కూడా.. అనిల్‌ రావిపూడి అదిరిపోయే వంటకం
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories