అందరి ముందు తన లవ్‌ స్టోరీ బయటపెట్టిన `జబర్దస్త్` వర్ష.. షాక్‌లో ఇమ్మాన్యుయెల్‌

First Published Sep 23, 2022, 7:48 PM IST

`జబర్దస్త్`లో రష్మి- సుధీర్‌ల తర్వాత ఆ స్థాయిలో పాపులర్‌ అయిన లవ్‌ స్టోరీ వర్ష, ఇమ్మాన్యుయెల్‌ దే. వీరిద్దరి కాంబినేషన్‌ ఎప్పుడూ హైలైట్‌ అవుతుంది. తాజాగా ఇమ్మాన్యుయెల్‌ కే షాకిచ్చింది `జబర్దస్త్` వర్ష. 
 

గత రెండు మూడేళ్లుగా `జబర్దస్త్` షోలో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జోడి బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీ నడుస్తున్నట్టుగా స్కిట్లుచేస్తూ షోకి హైప్‌ తీసుకొచ్చారు. ఒకటి రెండు సార్లు ఇద్దరికి ఎంగేజ్‌మెంట్లు, పెళ్లిళ్లు కూడా చేశారు. ఈ ఇద్దరు కలిసే స్కిట్లు చేస్తున్నారు. నవ్వులు పూయిస్తున్నారు. డ్యూయెట్లు, లవ్‌ ప్రపోజల్స్ తో ఆకట్టుకుంటున్నారు. 
 

రియల్‌ లైఫ్‌లోనూ ఈ ఇద్దరు లవర్స్ అని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందనేంతగా షోలో వీరి మధ్య కెమిస్ట్రీ డెవలప్‌ కావడం విశేషం. `జబర్దస్త్`లో మధ్య కొన్ని రోజులు ఇద్దరు విడి విడిగా చేసినా అనేక కామెంట్లు వచ్చాయి. ఇమ్మాన్యుయెల్‌తోనే చేయాలంటూ, వేరే వాళ్లతో ఊహించుకోవడం లేదంటూ కామెంట్లు వచ్చాయి. ఈ రూమర్స్ కి చెక్‌ పెట్టేందుకు వర్ష కొన్నాళ్లు `జబర్దస్త్`ని వీడింది. మళ్లీ వచ్చింది.కానీ మరీ అంత క్లోజ్‌గా మూవ్‌ అవడం లేదు. అయినా ఇద్దరు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం యదావిధిగా సాగుతూనే ఉంది. 
 

ఇదిలా ఉంటే తాజాగా ఇమ్మాన్యుయెల్‌కి గుండె పగిలే వార్త చెప్పింది వర్ష. ఈ జంటని ఇష్టపడే వారికి పెద్ద షాకిచ్చింది. తన సీక్రెట్‌ లవ్‌ స్టోరీని బయటపెట్టింది. అందరి ముందే తన ప్రేమ విషయాన్ని తెలిపి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇమ్మాన్యుయెల్‌ సైతం ఈ వార్త విని ముఖం వాడిపోవడం విశేషం. ఇంతకి ఏం జరిగిందంటే.. 
 

రష్మి యాంకర్‌గా ప్రతి ఆదివారం `శ్రీదేవి డ్రామా కంపెనీ` రన్‌ అవుతున్న విషయంతెలిసిందే. తాజాగా వచ్చే ఆదివారం ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో `అమ్మనా కోడలా` పేరుతో స్పెషల్‌ ఎపిసోడ్‌చేశారు. ఇందులో తమ మనసులో ఉన్న బాధని బయటపెట్టమని చెబుతుంది రష్మి.

ఈ సందర్భంగా ఒక్కొక్కరు తమ మనసులో విషయాన్ని పంచుకున్నారు. అందులో భాగంగా వర్ష సైతం తన లవ్‌ స్టోరీ చెబుతూ అందరికి షాకిచ్చింది. రీసెంట్‌గా మూడు నాలుగు నెలల నుంచి మేము సరిగా మాట్లాడుకోవడం లేదు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ` అంటూ ఎమోషన్‌ అయ్యింది. 
 

అయితే ఇమ్మాన్యుయెల్‌ ముందే ఈ విషయాన్ని వర్ష చెప్పడం ఆయనే కాదు, అందరిని షాక్‌కి గురి చేసింది. వర్ష ఇచ్చిన షాక్‌కి ఇమ్మాన్యుయెల్ ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరి వర్ష సీక్రెట్‌ లవర్‌ ఎవరు? అనేది తెలుకునేందుకు అభిమానులు వెతుకులాట ప్రారంభించారు. 
 

click me!