Alluri Movie : శ్రీవిష్ణు ‘అల్లూరి’ మూవీ రివ్యూ.!

First Published Sep 23, 2022, 6:53 PM IST

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన యాక్షన్ డ్రామా ‘అల్లూరి’ (Alluri). ఈ మాస్ అండ్ కమర్షియల్ ఫిల్మ్ నేడు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. 
 

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.    హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ప్రయత్న చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ‘అల్లురి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారకు. బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి శ్రీవిష్ణు మెప్పించాడా? కథ ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది? అనే విషయాలను రివ్యూలో తెలుసుకుందాం.
 

కథ : అల్లూరి సీతారామరాజు (శ్రీవిష్ణు) అనే పోలీస్ ఆఫీసర్ గా సేవలందిస్తుండగా కొన్ని కారణాలతో పలుమార్లు బదిలీలను ఎదుర్కొంటారు. ఈ క్రమంలో ఆయనకు ఏఏ సమస్యలు ఎదురయ్యాయి. ఎన్ని కేసులను సాల్వ్ చేశారు. ఏఏ కేసు ఎలా పరిష్కరించారు. ఈ సమయంలో ఆ పోలీస్ ఆఫీసర్ జీవితం ఎలా సాగిందనేదే సినిమా కథ. 

విశ్లేషణ : తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు శ్రీవిష్ణు. కొన్నాళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న శ్రీవిష్ణుకు ఈ చిత్రం కూడా అనుకూల ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం సినిమా కథ. స్టోరీ రొటీన్ గానే ఉంది. రొటీన్ కథ అయినప్పటికీ దర్శకుడు ప్రదీప్ వర్మ సినిమాను హ్యాండిల్ చేసిన తీరు ఇంట్రెస్టింగా ఉంటోంది. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. మాస్,  కమర్షియల్ సినిమాగా తెరకెక్కించారు. కానీ ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. కొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. సంగీతం సందర్భానుసారంగా సాగింది. 
 

నటీనటులు : శ్రీవిష్ణు ఫస్ట్ టైం ఫోలీస్ ఆఫీసర్ గా  అదరగొట్టాడు. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అలరించారు. గతంలో శ్రీవిష్ణు చేసిన అన్నీ పాత్రల్లోకెళ్లా పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడనే చెప్పాలి. ఎక్కడా తడబడకుండా నటనతో ఆకట్టుకున్నాడు. తనలోని మాస్ యాంగిల్ ను చూపించాడు. మరోవైపు హీరోయిన్ గా శ్రీవిష్ణు సరసన నటించిన కాయదు లోహర్ కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. ముఖ్యంగా ద్వితియార్ధంలో హీరోయిన్  పెర్పామెన్స్ తో ఆకట్టుకుంది. నెగెటివ్ పాత్రల్లో మధుసూదన రావు, రిషీ చక్కగా నటించారు.

బలాలు, బలహీనతలు : దర్శకత్వం పర్లేదు అనిపిస్తోంది. హీరో శ్రీవిష్ణు పెర్ఫామెన్స్  సినిమాకు ప్లస్. అలాగే హీరోయిన్ కాయదు లోహర్ కూడా గ్లామర్ పరంగా అలరించడం, చిత్రంలోని ఒకటి రెండు సర్ ప్రైజ్ లు బలాలుగా చెప్పొచ్చు. సినిమా కథ రొటీన్ గా ఉండటం మైనస్ గా అనిపిస్తోంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో సినిమా కథ స్లోగా వెళ్లడం కాస్తా ఆసక్తిని తగ్గించాయి. సంగీతం పర్లేదని చెప్పొచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నాసిరకంగా ఉన్నాయని సినిమా చూస్తే అర్థం అవుతోంది. 
 

కాస్ట్ అండ్ క్య్రూ : మాస్ అండ్ కమర్షియల్ ఫిల్మ్ ‘అల్లూరి’లో శ్రీవిష్ణు - కాయదు లోహర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీ రాజ్ తోట మరియు ధర్మేంద్ర కాకరాల ఎడిటర్ గా వ్యవహరించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్, బెక్కెం బాబిత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, సుమాన్,  మాధుసూదన్ రావు, రిషి, తదితరులు నటించారు. 
 

click me!