మహేష్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌.. రాజమౌళి ఊహకందని ప్లాన్‌.. బాక్సాఫీస్‌ కి చుక్కలే?

Published : Sep 23, 2022, 06:22 PM IST

మహేష్‌బాబుతో దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ సినిమాని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు క్రేజీ అప్‌డేట్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
16
మహేష్‌ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్‌.. రాజమౌళి ఊహకందని ప్లాన్‌.. బాక్సాఫీస్‌ కి చుక్కలే?

`బాహుబలి`తో తెలుగు సినిమా సత్తాని ఇండియా వైడ్‌గా చాటారు రాజమౌళి. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్నారు. ఈ చిత్రం ఓ వైపు `ఆస్కార్‌` నామినేషన్‌ కోసం పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి నెక్ట్స్ సినిమా కోసం భారీ సన్నాహాలు చేస్తున్నారు. కనీ విని ఎరుగని రీతిలో తన తదుపరి సినిమాని రూపొందించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. 

26

రాజమౌళి నెక్ట్స్ సూపర్‌స్టార్‌ మహేష్‌ తో సినిమా చేయబోతున్నారు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్టు సమాచారం. విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ షూటింగ్‌ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక, క్రియేటివ్‌ సైడ్‌ వర్క్ జరుగుతుంది. 
 

36

ఇటీవల రాజమౌళి చెబుతూ, మహేష్‌ తో సినిమాని యాక్షన్‌ అడ్వెంచర్‌గా, ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి యాత్ర నేపథ్యంలో సాగుతుందని తెలిపారు. ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లని కూడా తీసుకోవాలనుకుంటున్నారట. పూర్తిగా దీన్ని ఓ ఇంటర్నేషనల్‌ ప్రాజెక్ట్ గా టేకోవర్‌ చేయబోతున్నారట రాజమౌళి. 
 

46

ఇప్పటి వరకు దీన్ని పాన్‌ ఇండియా స్థాయి సినిమాగానే భావించారు. కానీ రాజమౌళి మాత్రం అంతకు మించి ఆలోచిస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో అంతర్జాతీయంగా, ముఖ్యంగా వెస్ట్ సైడ్‌ కంట్రీస్‌ నుంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ ఆ సినిమాని ప్రశంసిస్తున్నారు. ఈనేపథ్యంలో మహేష్‌ సినిమాని అంతర్జాతీయ మూవీగా తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నారట రాజమౌళి. అందుకోసం ఏకంగా ఓ హాలీవుడ్‌ టాలెంట్‌ కంపెనీ `క్రియేటివ్‌ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ`(సీఏఏ)తో జక్కన్న ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. 

56

ఈ సీఏఏ సంస్థలో ఒప్పందం చేసుకున్న వారికి అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తుంది. అలా రాజమౌళి సినిమాకి అంతర్జాతీయ కాస్టింగ్‌ని ఇవ్వడంతోపాటు రాజమౌళిని అంతర్జాతీయంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది మహేష్‌ సినిమాకి హెల్ప్ కాబోతుందని, ఇదంతా రాజమౌళి వేసిన మాస్టర్‌ ప్లాన్‌ అని తెలుస్తుంది. ఊహించని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో జక్కన్న ఉన్నారట. `ఇండియానా జోన్స్` తరహాలో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 
 

66

ఇదే నిజమైతే ఇక మహేష్‌ సినిమా బాక్సాఫీసుకి చుక్కలు చూపించడం ఖాయం. అంతర్జాతీయంగా ఈ చిత్రం సంచలనాలు క్రియేట్‌ చేయబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది మహేష్‌ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమా కోసం అటు మహేష్‌, ఆయన అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మహేష్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయబోతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories