అనసూయ దంపతుల మధ్యలోకి ఆ లేడీ... విడదీయాలని విశ్వ ప్రయత్నం! ఆమె డ్యూటీ గట్టిగా చేసుంటే కథ వేరేలా ఉండేది!

Published : Jul 09, 2024, 07:19 PM IST

అనసూయ-సుశాంక్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓ లేడీ వాళ్ళ ఇద్దరి మధ్యలోకి ఎంటరైందట. ఎలాగైనా విడదీయాలని విశ్వ ప్రయత్నం చేసిందట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది..   

PREV
16
అనసూయ దంపతుల మధ్యలోకి ఆ లేడీ... విడదీయాలని విశ్వ ప్రయత్నం! ఆమె డ్యూటీ గట్టిగా చేసుంటే కథ వేరేలా ఉండేది!


మొదటి నుండే అనసూయ రెబల్. టామ్ బాయ్ ఆటిట్యూడ్ మైంటైన్ చేసేది. చదువుకునే రోజుల్లో ఎన్సీసీ క్యాడెట్ ఆమె. అనేక క్యాంపులు చేసింది. అప్పుడే సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. టీనేజ్ లోనే అనసూయ-సుశాంక్ భరద్వాజ్ ప్రేమలో పడ్డారు. 
 

26
Anasuya Bharadwaj

ఏళ్ల తరబడి వీరి పేమ కథ సాగింది. చదువు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. అనసూయ తండ్రి ససేమిరా అన్నాడు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ చెల్లికి పెళ్లి కాదని గట్టిగా చెప్పాడు. అనసూయ వినలేదు. ఒక దశలో లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని అనసూయ సుశాంత్ తో అందట. సుశాంక్ అందుకు ఒప్పుకోలేదట. పేరెంట్స్ అంగీకారం తెలిపాకే పెళ్లి చేసుకుందాము అన్నాడట. 
 

36
Anasuya Bharadwaj

ఎట్టకేలకు అనసూయ తండ్రి మనసు కరిగిందట. అనసూయ-సుశాంక్ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు సంతానం. అయితే సుశాంక్-అనసూయలను ఓ లేడీ విడదీయాలని చూసిందట. వారి బంధానికి మధ్యలో అడ్డుగోడగా నిలిచిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

46


అనసూయ బుల్లితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. శేఖర్ మాస్టర్ మరొక జడ్జి. ఈ షో మేకర్స్ అనసూయకు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. తాను చదువుకునే రోజుల్లో ఎంసీసీ టైనింగ్ ఆఫీసర్ గా ఉన్న సరోజ్ బాలా వచ్చారు. ఆమెను చూసిన అనసూయ పరుగున వెళ్లి హగ్ చేసుకుంది. 

56

ఆ రోజుల్లో ఎన్సీసీ క్యాంప్స్ లో చోటు చేసుకున్న విషయాలు వారు గుర్తు చేసుకున్నారు. అనసూయ అబ్బాయిల కంట పడకుండా దాచేసేదాన్ని, ఎవరు లైన్ వేస్తారో అని ట్రైనింగ్ ఆఫీసర్ అన్నారు. యాంకర్  శ్రీముఖి మధ్యలో కల్పించుకుని 'మరి ఎన్సీసీ క్యాంపు లోనే సుశాంక్ ని అనసూయ ప్రేమించారట కదా... అని అడిగింది. 

 

66

అనసూయ-సుశాంక్ లను విడదీయడానికి నేను అనేక ప్రయత్నాలు చేశానని ఎన్సీసీ ఆఫీసర్ అన్నారు. మేడం వలన ఆ రోజుల్లో నేను సుశాంక్ ఒక్క ఫోటో కూడా దిగలేకపోయామని అనసూయ అన్నారు. తన మేడమ్ ని అనసూయ ఈ షో వేదికగా సన్మానించింది. అదన్నమాట మేటర్. మేడం కొంచెం గట్టిగా డ్యూటీ చేసి ఉంటే... అనసూయ ఎవరి భార్య అయ్యేవారో కదా..

Read more Photos on
click me!

Recommended Stories