వెన్నెల మింగేసిందా మబ్బులతో స్నానం చేసిందా... తెల్లని బట్టల్లో చందమామలా మెరిసిపోతున్న జబర్ధస్త్ వర్ష 

Published : May 10, 2022, 06:51 PM IST

పున్నమి రాత్రి చందమామలా మెరిసిపోతుంది జబర్దస్త్ వర్ష. ఈ బుల్లితెర సెలబ్రిటీ తెల్లని దుస్తుల్లో దేవకన్యలా తోచింది. వెన్నెలను మిగేసిందా లేక మబ్బులతో స్నానం చేసినట్లుంగా... మెరిసిపోతున్న ఆమె గ్లామర్ కట్టిపడేస్తుంది.   

PREV
18
వెన్నెల మింగేసిందా మబ్బులతో స్నానం చేసిందా... తెల్లని బట్టల్లో చందమామలా మెరిసిపోతున్న జబర్ధస్త్ వర్ష 
Jabardasth Varsha


జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష (Varsha)ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీంతో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

28
Jabardasth Varsha


వస్తూనే తన గ్లామర్ తో ప్రేక్షకులను తన మాయలో పడేసుకుంది వర్ష. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ జబర్దస్త్ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. 

38
Jabardasth Varsha


వర్ష, ఇమ్మానియేల్ కెమిస్ట్రీ స్కిట్స్ లో ఫుల్ గా వర్క్ అవుట్ అవుతుంది. మరోవైపు ఆఫ్ స్క్రీన్ లో కూడా వర్ష, ఇమ్మానియేల్ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతుంది. వాళ్ళ ప్రవర్తన కూడా అనుమానాలు బలపరిచేదిగా ఉంది. ఇమ్మానియేల్ పై అపరిమితమైన ప్రేమను చాటుకుంటుంది వర్ష, అలాగే ఇమ్మానియేల్ కూడా వర్ష అంటే పడి చస్తారు.
 

48
Jabardasth Varsha

వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ అన్న బ్రాండ్ నేమ్ వాళ్ళ కెరీర్ కి ఉపయోగపడుతుంది. ఆ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వీరిద్దరికి పెళ్లి చేసిన విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ తర్వాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన జంటగా వీరిద్దరూ నిలిచారు.
 

58


కొన్నాళ్ళు జబర్ధస్త్ (Jabardasth) వేదికపై వర్ష కనిపించలేదు. ఇమ్మానియేల్ తో ఆమె చేస్తున్న స్కిట్స్ కి యూట్యూబ్ లో వల్గర్ కామెంట్స్ చేస్తున్నారట. ఏమిటి అక్కా.. ఇది అంటూ వర్ష బ్రదర్ ఆమెను నిలదీశాడట. ఈ విషయం జబర్దస్త్ వేదికపై చెప్పిన వర్ష... జబర్దస్త్ మానేస్తున్నాను అన్నారు. నిజంగానే కొన్నాళ్ళు ఆమె జబర్దస్త్ కి దూరమయ్యారు.అయితే మరలా ఎంట్రీ ఇచ్చారు.'

68


కాగా ఇటీవల ప్రసారమైన ఓ స్పెషల్ ఈవెంట్ లో ఇమ్మానియేల్ ఆమెను బాధపెట్టారు. లేడీ గెటప్ అనడంతో వర్ష సీరియస్ కావడంతో పాటు ఈవెంట్ నుండి వెళ్లిపోయారు. ఈ విషయంలో వర్ష ఇమ్మానియేల్ గొడవపడ్డారు.  అయితే ఇవన్నీ కేవలం సెన్సేషన్ కోసమే. మరలా ఇద్దరూ కలిసి స్కిట్స్ చేస్తున్నారు.

78

వర్షకు బుల్లితెరపై మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. ఆమె స్టార్ యాంకర్, బుల్లితెర ఆర్టిస్ట్ గా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి కారణం ఆమె ఫాలోయింగ్ కూడా. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టెలివిజన్ కేటగిరీ లో టాప్ టెన్ లో చోటు దక్కించుకుంది. ఆమెకు ఆరవ స్థానం లభించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆమెకు ఎంత క్రేజ్ ఉందో.

88


సన్న నడుము జబర్దస్త్ సుందరి వర్ష మామిడి తోటలో ఒంటరిగా కనిపించింది. లంగా జాకెట్ ధరించి గ్లామర్ విందు చేసింది.  పచ్చని చెట్ల మధ్య నెమలి పిల్లలా ఉన్న జబర్దస్త్ వర్షను చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ మనసు పారేసుకుంటున్నారు. 

click me!

Recommended Stories