2018లో చాలా కాలంగా ప్రేమిస్తున్న రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ ని వివాహం చేసుకుంది శ్రియా. లాక్ డౌన్ సమయంలో ఎవరికీ తెలియకుండా తల్లై, ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కాస్తా సినిమా జోరును తగ్గించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ లైనప్ చేస్తోంది. ప్రస్తుతం దృశ్యం 2 హిందీ రీమేక్ తో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్నారు.