అది, ఇది అంటూ అగౌరవంగా మాట్లాడాడు.. బూతులతో సమాధానం ఇచ్చా.. నందిని రెడ్డి షాకింగ్ కామెంట్స్

First Published May 10, 2022, 5:18 PM IST

అలా మొదలైంది, ఓ బేబీ లాంటి సూపర్ హాట్ చిత్రాలతో లేడి నందిని రెడ్డి టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మహిళా దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు.

Nandini Reddy

అలా మొదలైంది, ఓ బేబీ లాంటి సూపర్ హాట్ చిత్రాలతో లేడి నందిని రెడ్డి టాలీవుడ్ లో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. మహిళా దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. నిలదొక్కుకునే వారు చాలా తక్కువ. కానీ నందిని రెడ్డి చాలా కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు. 

మహిళలంటే చాలా చోట్ల చిన్న చూపు ఉన్నట్లే తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కల్యాణ వైభోగమే చిత్రం షూటింగ్ జరుగుతున్నప్పుడు తాను మహిళ అనే చిన్నచూపుతో సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అసభ్యంగా మాట్లాడాడు. 

కెమెరా లెన్స్ ని ఆయన రద్దు చేశారు. అవి సాంగ్ షూటింగ్ కి అవసరం. దీనితో అతడికి చెప్పకుండా నేను నిర్మాతని అడిగి తెప్పించుకున్నా. దీనితో నాకు చెప్పకుండా చేస్తోంది అనే ఫీలింగ్ అతనిలో మొదలైంది. ప్రమాదవశాత్తూ ఓ కెమెరా లెన్స్ విరిగింది. దాని కాస్ట్ 20 వేల వరకు ఉంటుంది. తర్వాత చూసుకుందాం అని షూటింగ్ కంటిన్యూ చేస్తుంటే.. నా అసిస్టెంట్ తో అతడు అసభ్యంగా మాట్లాడాడట. 

ఏమనుకుంటోంది అది.. ఇది అని ఏకవచనంతో సంభోదిస్తూ తిట్టాడట. ఆ విషయం నా దృష్టికి వచ్చింది. దీనితో వెంటనే నిర్మాతని కలిసి అతడు సెట్స్ లో ఉంటే నేను సినిమా చేయను.. వెళ్ళిపోతాను అని నిర్మాతతో చెప్పాను. ఆయన సీనియర్.. యూనియన్ కాంటాక్ట్స్ ఉన్నాయి.. ప్రాబ్లెమ్ అవుతుంది అని అన్నారు. అవన్నీ నాకు అనవసరం..అతను ఉంటే నేను సినిమా చేయను అని చెప్పాను. 

దీనితో అతడిని సినిమా నుంచి తప్పించారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు. వెంటనే నేనెను షూటింగ్ నుంచి వెళ్ళిపోతున్నట్లు నిర్మాతకు సమాచారం ఇవ్వండి అని అక్కడున్నవాళ్లకు చెప్పాను. నాకు నిర్మాత నుంచి ఫోన్ వచ్చింది. ఆ నా *** సెట్స్ లో ఉంటె నేను రాను అని నిర్మాతకు చెప్పాను. నేను బూతు మాట మాట్లాడడం అదే తొలిసారి. 

ఆయన సినిమా షూటింగ్ కోసం రాలేదు. ఏదో క్యాంపెనింగ్ కి వచ్చారు అని చెప్పారు. దీనితో నేను తిరిగి షూటింగ్ కి వెళ్లినట్లు నందిని రెడ్డి తెలిపారు. ఆ సంఘటన మినహా ఇండస్ట్రీలో తనకు ఎలాంటి చేదు అనుభవం లేదని నందిని రెడ్డి అన్నారు. 

click me!