వర్షకు సినిమాలు, సీరియల్స్ ద్వారా రాని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా వచ్చింది. ముఖ్యంగా జబర్దస్త్‌లో ఇమ్మాన్యూయేల్ తో కాంబినేషన్ స్కిట్స్ అంటే.. ఇప్పటికీ జనాలకు క్రేజ్ ఎక్కువ. వరుస పంచ్ లతో.. కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో.. వర్ష చేసే అరాచకం అంతా ఇంతా కాదు. ఇన్ స్టాలో వరుస ఫోటో షూట్లతో హడావిడి చేస్తుంది బ్యూటీ. అంతే కాదు హాట్ ఫోటో షూట్లతో ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది బ్యూటీ.