పవన్‌ కళ్యాణ్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హోరెత్తిపోయిన శిల్పకళా వేదిక.. Photos

Published : Jul 25, 2023, 10:33 PM IST

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `బ్రో`. సాయితేజ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ చిత్రం నేడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో జరుగుతుంది. తాజాగా పవన్‌ ఎంట్రీ ఇచ్చారు.   

PREV
16
పవన్‌ కళ్యాణ్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హోరెత్తిపోయిన శిల్పకళా వేదిక.. Photos

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `బ్రో`. సాయితేజ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈ చిత్రం నేడు మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో శిల్పకళావేదికలో జరుగుతుంది. తాజాగా పవన్‌ ఎంట్రీ ఇచ్చారు. 
 

26

ఆయన వైట్‌ టూ వైట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో శిల్పకళావేదిక ఒక్కసారిగా హోరెత్తిపోయింది. అభిమాన హీరో రావడంతో అభిమానులో అరుపులతో వేదిక దద్దరిల్లేలా చేశారు. పవన్‌ రాక.. శిల్పకళావేదికలోకి ఒక ఆరా వచ్చినట్టుగా ఫ్యాన్స్ ఫీల్‌ కావడం విశేషం. 
 

36

అయితే పవన్‌ మాత్రం చాలా సింపుల్‌గా వచ్చి అందరికి అభివాదం తెలియజేశారు. వచ్చిన గెస్ట్ లకు ఆయన అభివాదం తెలియజేశారు. మొత్తంగా పవన్ ఎంట్రీ `బ్రో` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైలైట్‌గా నిలిచింది.

46

ఇక వర్షం కారణంగా,పవన్‌ రాక ఆలస్యం కారణంగా.. `బ్రో` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కాస్త లేట్‌ గా ప్రారంభమైంది. లేట్‌గా అయినా లేటెస్ట్ గా, ఆద్యంతం సందడిగా ఈ ఈవెంట్‌ సాగింది. తమన్‌ పాటలతో హోరెత్తించారు. మరోవైపు ఫేమస్‌ డ్రమ్మర్ శివమణి విశ్వరూపం చూపించారు.

56

 ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌తోపాటు సాయితేజ్‌, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, దర్శకుడు సముద్రఖని, బీవీఎస్‌ రవి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌, వివేక్ కూచిబొట్ట, టీజీ వెంకటేష్‌, హీరోయిన్లు ప్రియా ప్రకాష్‌ వారియర్‌, కేతిక శర్మ, ఊర్వశి రౌతేలా పాల్గొన్నారు. 

66

సముద్రఖని దర్శకత్వం వహించిన `బ్రో` చిత్రంలో పవన్ తోపాటు సాయితేజ్‌ నటించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories