చిరంజీవికి గాలం వెయ్యాలనే ఆలోచన అల్లు రామలింగయ్యది కాదా? తెరవెనుక ఉన్న ఆ లేడీ ఎవరు?

First Published | Dec 16, 2024, 7:14 PM IST

చిరంజీవిని అల్లుడు చేసుకోవాలనేది అల్లు రామలింగయ్య ఆలోచన అని అంతా అనుకుంటారు. కానీ ఆయన కాదట. దీని వెనుక ఓ లేడీ ఉందట. ఆమె వల్లనే ఇది స్టార్ట్ అయ్యిందట. మరి ఆమె ఎవరు?

చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఎంత మంది తర్వాతి తరం హీరోలు వచ్చినా, ఎన్ని పాన్‌ ఇండియా సినిమాలు చేసినా, ఎన్ని వేల కోట్లు కలెక్షన్లు వసూలు చేసినా తెలుగు చిత్ర పరిశ్రమకి ఒకే ఒక్క మెగాస్టార్‌, ఆయనే చిరంజీవి. దాదాపు నాలుగున్న దశాబ్దాలుగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పటికీ ఫుల్‌ బిజీగా ఉన్నారు చిరు. 

Read more: చిరు, బాలయ్య, చైతూ.. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోలు వీరే

Allu Ramalingaiah

ఇదిలా ఉంటే చిరంజీవి.. లెజెండరీ కమెడియన్‌ అల్లు రామలింగయ్య కూతురు, ప్రస్తుత నిర్మాత అల్లు అరవింద్ చెల్లి, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అత్తయ్య సురేఖని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవికి సురేఖని ఇవ్వాలనేది అల్లు రామలింగయ్య ఆలోచన అని అంతా అనుకుంటారు.

చిరంజీవి హీరోగా బాగా రాణిస్తుండటం, మంచి విజయాలు అందుకోవడం, అప్పటి వరకు ఉన్న హీరోలతో పోల్చితే ఆ స్పీడ్‌, చురుకుతనం, అద్భుతమైన నటన, డాన్సులు ఎంతో మందిని ముగ్దుల్ని చేశాయి. అల్లు రామలింగయ్య కూడా అలానే ఫిదా అయ్యాడు. 
 


Megastar Chiranjeevi

ఇప్పుడే ఇలా ఉన్నాడంటే మున్ముందే పెద్ద రేంజ్‌కి వెళ్తాడు, సూపర్‌ స్టార్‌ అయిపోతాడని భావించాడు రామలింగయ్య. దీంతో నెమ్మదిగా గాలం(అల్లుడిని చేసుకోవాలని) వేయాలని ప్లాన్‌ చేశాడు. తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందనుకున్నాడు. చాలా రోజులు చిరంజీవిని గమనించాడట.

ఆయనకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలా ప్రవర్తిస్తాడు, ఏమేం చేస్తుంటాడనేది గమనించాడట. చిరు గురించి అన్నీ తెలుసుకున్నాడట. అన్ని విషయాల్లో ఓకే అనుకున్నాకే, నెమ్మదిగా పెళ్లి ప్రపోజల్‌ తీసుకొచ్చాడట. కొందరు పెద్దలతో రాయభారం నడిపించి మొత్తానికి ఒప్పించి పెళ్లి చేశారు. 
 

Megastar Chiranjeevi

అప్పటికే చిరంజీవి ఫుల్‌ బిజీగా ఉన్నాడు. రోజు రెండు మూడు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొనేంత బిజీ. ఒక్క రోజు కూడా ఖాళీ లేదు. అలాంటి క్లిష్ట సమయంలోనే మూడు రోజులు సెలవు పెట్టించి పెళ్లి చేయించారు. శోభనానికి కూడా టైమ్‌ లేకుండా చిరు, సురేఖల మ్యారేజ్‌ జరిగింది.

ఆ సమయంలో రాఘవేంద్రరావుతో సినిమాలో పాల్గొంటున్నారట.ఆ మూవీ చిత్రీకరణ అయిపోయిన తర్వాత ట్రైన్‌లో ఫస్ట్ నైట్‌ ఏర్పాటు చేయించాడు దర్శకుడు. అలా చిరు, సురేఖలు మ్యారేజ్‌ లైఫ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

Also read: సుడిగాలి సుధీర్‌, రష్మి రహస్యంగా కలుస్తున్నారా? ఆవేశంలో అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్‌
 

Megastar Chiranjeevi

ఇదిలా ఉంటే చిరంజీవిని అల్లుడు చేసుకోవాలనేది అల్లు రామలింగయ్య ఆలోచన కాదట. దీని వెనుక ఒక లేడీ ఉంది.ఆమె ఎవరో కాదు, అల్లు రామలింగయ్య భార్య, అల్లు అరవింద్‌ అమ్మ కనకరత్నం ఆలోచన. ఆమెకి ఎలా వచ్చిందటే. ఓ రోజు చిరంజీవి వాళ్ల ఇంటికి వచ్చాడట. సత్యనారాయణ అనే వారి బంధువు ఇంటి మేడ మీద ఉండేవారు.

ఆయన్ని కలవడానికి చిరు వచ్చారు. ఇంట్లో కనకరత్నం ఒక్కరే ఉన్నారు. డోర్‌ కొట్టగానే చిరు కనిపించాడు. సత్య నారాయణ కావాలంటే పైన ఉన్నాడని చెప్పిందట. పైకి వెళ్లి ఆయనతో మాట్లాడి వెళ్లే టప్పుడు వస్తానండి అని ఆమెకి చెప్పి వెళ్లిపోయాడట చిరు. 

అప్పటికీ ఆయన చిరంజీవి అని తెలియదు. ఏదో సినిమాల్లో చూసినట్టు అనిపించింది. పైన ఉన్న సత్యనారాయణని పిలిచి ఎవరు ఈ అబ్బాయి అంటే చిరంజీవి అని, కొత్త కుర్రాడు, సినిమాలు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడని చెప్పాడట. చూడ్డానికి బాగా కనిపించాడు, అల్లుడు అయితే బాగుంటుంది అనే ఆలోచన ఆమెకి వచ్చిందట.

సురేఖని ఇస్తే బాగుంటుందనిపించిందట. మనోళ్లేనా అంటే మనోళ్లే అన్నాడట. ఇంకా ఆశలు కలిగాయి. ఈ విషయాన్ని అల్లు రామలింగయ్యకి చెప్పిందట కనకరత్నం. ఆయన గాలం వేయడం ప్రారంభించాడు, విజయవంతంగా వలలో వేసుకున్నాడు. సురేఖని ఇచ్చిపెళ్లి చేశాడు. మెగాస్టార్‌ని తన అల్లుడిని చేసుకున్నాడు రామలింగయ్య. ఈ విషయాన్ని అల్లు అరవింద్‌.. అలీ షోలో తెలపడం విశేషం. 

చిరంజీవి ఇప్పుడు మెగాస్టార్‌గా ఎదిగాడు. తన ఫ్యామిలీలో దాదాపు పది మంది సినిమాల్లోకి రావడం, యాక్టర్లుగా నిలబడానికి పునాది వేశాడు చిరు, ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేని ఆయన ఓ మహా వృక్షంలా ఎదిగి ఎంతో మందికి నీడనిస్తున్నాడు. అవకాశాలు ఇప్పిస్తున్నారు.

తన మెగా, అల్లు ఫ్యామిలీ నుంచి హీరోలుగా రావడానికి మంచి బాటలువేశారు. ఇప్పటికీ వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు చిరు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. 

read more: ఫ్యామిలీతో సహా చిరంజీవిని అల్లు అర్జున్‌ కలవడం వెనుక అసలు కారణం ఇదే, ఆ క్రెడిట్‌ మొత్తం ఆయనకేనా?
 

Latest Videos

click me!