ఒకప్పుడు పార్వతీ, దేవదాస్, ఇప్పుడు నేనూ వర్ష, కానీ ఏంటో నా తలరాత.. వర్ష మాత్రం తనని ప్రేమించడం లేదని, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నాడు ఇమ్మాన్యుయెల్. స్టేజ్‌పైనే తాగుతూ తన గోడుని వెళ్లబోసుకున్్నాడు. చేతిలో కుక్కపిల్లని పట్టుకుని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశాడు. `నా తల రాత నీకు చెప్పుకుందామంటే ఇద్దరి తలరాతలు ఒక్కటే, వాడు(సుధీర్) అక్కడ, నేను ఇక్కడ` అంటూ రెచ్చిపోయాడు ఇమ్మూ. దీనికి రష్మి గౌతమ్‌ని నవ్వుతూ రియాక్ట్ అయ్యింది.