పెళ్లిపీటలు ఎక్కబోతున్న దేవీశ్రీ ప్రసాద్? అమ్మాయి డిటేయిల్స్ ఇవే.. ఆయనకంటే అంత చిన్నదా.!

First Published | Apr 3, 2023, 5:38 PM IST

రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) త్వరలో పెళ్లి  పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.  
 

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘దేవీక్’ చిత్రం నుంచి మొన్నటి  ‘వాల్తేరు  వీరయ్య’ చిత్రం వరకు ఎన్నో  సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు. దేవీశ్రీ  మ్యూజిక్ కు చాలా మంది అభిమానులే ఉన్నారు.
 

20 ఏండ్లలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించి ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకున్నారు. కేరీర్ విషయం అలా ఉంటే.. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. గతంలో ఆయా ముద్దుగుమ్మలతో లవ్ లో ఉన్నారంటూ చాలా పుకార్లు వచ్చాయి.  అవన్నీ అవాస్తవాలని తేలిపోయింది.రీసెంట్ గా నటి పూజితా పొన్నాడ విషయంలోనూ నిజం లేదని స్పష్టమైంది.
 


నాలుగు పదుల వయస్సు దాటినా DSP ఇంకెప్పుడు పెళ్లి  చేసుకుంటారని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తాజాగా గుడ్ న్యూస్ అందింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దేవిశ్రీ ప్రసాద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది.  
 

రీసెంట్ గానే అమ్మాయి కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లికి  సంబంధించిన డిటేయిల్స్ అందినా అందోచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో దేవీశ్రీ ప్రాసాద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. 

అమ్మాయి విషయానికొస్తే.. తమ బంధువుల అమ్మాయినే దేవీశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కాస్తా దూరపు బంధువులని,  వరసకు మరదల్ అవుతుందని, ఆమెనే దేవీశ్రీ వివాహం  చేసుకోబుతున్నారని అంటున్నారు. ఇంకా ఆమె  గురించి పూర్తి  వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరో షాకింగ్ విషయం ఏంటంటే దేవీశ్రీకి, ఆమెకు దాదాపు 17 ఏండ్ల ఏజ్ గ్యాప్ ఉంటుందంట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.  త్వరలో కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి  వివాహం జరుగుతుందని జోరుగా టాక్ వినిపిస్తోంది.  ప్రస్తుతం దేవీశ్రీ లైవ్ కాన్సెట్ కోసం మలేషియాలో ఉన్నట్టు తెలుస్తోంది.  

Latest Videos

click me!