Roja on Selvamani: సెల్వమణి `రేసుగుర్రం`లో శృతి హాసన్‌లాంటోడు.. భర్తపై `జబర్దస్త్` రోజా షాకింగ్‌ కామెంట్‌..

Published : Feb 21, 2022, 06:20 PM IST

`జబర్దస్త్` జడ్జ్, ఎమ్మెల్యే రోజా తన భర్త దర్శకుడు సెల్వమణిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన్ని ఏకంగా శృతి హాసన్‌తో పోల్చింది. ఆయనకు అంత సీన్‌ లేదంటూ కామెంట్‌ చేసి కమెడీయన్లని షాకిచ్చింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే. 

PREV
17
Roja on Selvamani: సెల్వమణి `రేసుగుర్రం`లో శృతి హాసన్‌లాంటోడు.. భర్తపై `జబర్దస్త్` రోజా షాకింగ్‌ కామెంట్‌..

`జబర్దస్త్` షో(Jabardasth Show)కి రోజా జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కమెడీయన్లపై పంచ్‌లు వేస్తూ నవ్వులు పూయిస్తుంటుంది. అదే సమయంలో కొన్ని సార్లు కమెడీయన్లు కూడా రోజా(Roja)పై జోకులేస్తుంటారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ కామెడీ స్కిట్లు సాగుతుంటాయి. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోరు. 
 

27

అందులో భాగంగానే ఈ కామెడీ షోలో కమెడీయన్‌ నూకరాజు(Nukaraju).. రోజా,సెల్వమణిలను ఉద్దేశించి ఓ సెటైర్‌ వేశాడు. నూకరాజ్‌ టీమ్‌.. Rojaపై స్కిట్‌ చేశారు. ఇందులో ఇద్దరు కమెడీయన్లు రోజా ఇంటికెళ్లి ఆమె కొత్తింటిని చూద్దామనుకున్నారు. ఇంతలో రోజా వస్తుందని తెలిసి ఆమెకి కనిపించకుండా దాక్కున్నారు. రోజా పాత్రలో నటించిన మహిళా కమెడీయన్‌ గాంభీర్యంగా వచ్చి అబ్బాయిలకు అన్యాయం జరిగితే అరగంట ఆలస్యమవుతుందేమోగానీ, అమ్మాయిలకు ఆలస్యమైతే అర నిమిషం కూడా ఆలస్యం చేయనంటూ ఆమె వేసిన పంచ్‌ నవ్వులు పూయించింది. 

37

ఇంతలో స్టేజ్‌పైకి వచ్చిన నూకరాజు.. రెచ్చిపోయాడు. `నా నోరు లాగుతుంది. రోజా అందంగా ఉంది అని అని. నేనే సెల్వమణి` అని పంచ్‌ వేశాడు. దీనికి ఆశ్చర్యపోయిన రోజా, నూకరాజుని చూసి నవ్వులు పూయించింది. అంతేకాదు నూకరాజుని తన వద్దకి పిలిపించుకుని ప్రేమతో అభినందన తెలిపింది. Jabardasth show Promo.

47

అనంతరం రోజా అసలు విషయం బయటపెట్టింది. ఇంట్లో సెల్వమణి ఎలా ఉండాలో వెల్లడించింది. జనరల్‌గా రోజా అంటే ఫైర్‌బ్రాండ్‌ అనే పేరుంది. ఆమె రాజకీయ నాయకురాలిగా బలంగా, బోల్డ్ గా తన వాయిస్‌ని వినిపిస్తుంది. ఎవరైనా విమర్శించాలన్నా, ఏమాత్రం వెనకడుగు వేయకుండా బోల్డ్ గా స్పందిస్తుంది.ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. కానీ తన భర్త సెల్వమణి మాత్రం అందుకు పూర్తి ఆపోజిట్‌ అని పేర్కొంది. 

57

నూకరాజు చేసిన స్కిట్‌ని ఉద్దేశిస్తూ, చాలా హ్యాపీగా ఉందని, ఎందుకంటే సెల్వ `రేసుగుర్రం`లో హీరోయిన్‌(శృతి హాసన్‌) లాంటివారని పేర్కొంది. అన్ని లోపలే అనుకుంటాడు. బయటకు చెప్పడని పేర్కొంది. దీంతో యాంకర్‌ అనసూయ అయ్యో అంటూ నవ్వులు పూయించారు. అంతేకాదు నూకరాజుని తాను చెప్పిన డైలాగులను వైట్‌ పేపర్‌పై రాసి ఇవ్వాలని, ఇంటికెళ్లాక సెల్వమణితో చెప్పించుకుంటానని తెలిపి మరో షాకిచ్చింది. 

67

ఇదంతా `జబర్దస్త్` లేటెస్ట్ ప్రోమోకి సంబంధించినది. తాజాగా `జబర్దస్త్` షోకి సంబంధించిన ఈ ప్రోమో విడుదల కాగా, ఇందులో రోజా విషయాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రోమో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 

77

ఇక దర్శకుడు సెల్వమణి తమిళంలో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాలు రూపొందించారు. కానీ ప్రస్తుతం సినిమాల తీరు మారిపోయిన నేపథ్యంలో డైరెక్షన్‌కి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్‌లో సినీ పరిశ్రమలో దర్శకుల సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. మరోవైపు రోజా, సెల్వమణి ఇష్టపడి 2002లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories