ఇదిలా ఉండగా ఇటీవల కాజల్ తన బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేసినప్పుడు కొందరు నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్, ట్రోలింగ్ ఎదుర్కొంది. మహిళలు గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో మార్పులు సహజమే. కానీ కాజల్ బేబీ బంప్ తో ఉండడంపై కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటూ వారికి కాజల్ తనదైన శైలిలో గట్టిగా బదులిచ్చింది. బాడీ షేమింగ్ చేసే కొందరు మూర్ఖులు కోసమే ఇది అంటూ సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది.