ఇక స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది రకుల్ ప్రీత్ సింగ్. సీనియర్లలో నాగార్జునతో కలిసి నటించిన ఆమె.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఎన్టీఆర్, మహేష్, రామ్‌చరణ్, బన్నీ, గోపీచంద్, ఆది, రామ్, నితిన్ ఇలా యంగ్‌స్టర్స్ తోనూ ఆడిపాడింది. చివరగా `కొండపొలం` చిత్రంలో వైష్ణవ్‌తేజ్‌తో కలిసి నటించగా, ఈ చిత్రం నిరాశపరిచింది.