రష్మి గౌతమ్‌ డ్రెస్‌ సైజ్ తగ్గించాలని మహిళలు డిమాండ్‌.. జబర్దస్త్ యాంకర్‌ రియాక్షన్‌ తెలిస్తే ఫ్యూజుల్‌ ఔటే

First Published | Jun 5, 2024, 6:53 PM IST

రష్మి గౌతమ్‌ పొట్టిదుస్తులతో జబర్దస్త్ షోలో రచ్చ చేస్తుంది. అయితే ఆ డ్రెస్‌ సైజ్‌ ఇంకా తగ్గించాలని మహిళలే రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడం షాకిస్తుంది. 
 

జబర్దస్త్ కామెడీ షోకి గ్లామర్‌ తెస్తుందన్నది ఎవరైనా ఉన్నారంటే అది రష్మి గౌతమే. ఆమె పొట్టి దుస్తులేసుకుని అందాల విందు చేస్తూ అలరిస్తుంది. జబర్దస్త్ కమెడియన్ల కామెడీకి, రష్మి అందాలు తోడు కావడంతో షో రక్తి కడుతుంది. ఫుల్‌ మీల్స్ లా మారిపోతుంది. గ్లామర్‌ షో విషయంలో రష్మి కూడా తగ్గదు. తీరైన దుస్తుల్లో డిఫరెంట్‌ యాంగిల్స్ లో గ్లామర్‌ షో చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

జబర్దస్త్ షో రెండుగా ఉండేది. ఇప్పుడు ఒక్కటగా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈ వారం నుంచే `జబర్దస్త్` షో మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇది రెండు రోజులు ప్రసారమవుతుంది. సగం సగంగా టెలికాస్ట్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో ఎక్ట్స్ ట్రా జబర్దస్త్ షో ని తీసేయడం పట్ల జబర్దస్త్ కమెడియన్లు ధర్నాకి దిగారు. రౌడీ రోహిణి కొంతమంది మహిళలను వేసుకుని వచ్చింది. ధర్నాకి దిగింది. 
 


ఒక ఆడియెన్ గా `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోని చాలా మిస్‌ అవుతున్నామని, టీవీల్లో రోజూ చూసేవాళ్లమని తెలిపింది. ఎవరిని అడిగి తీశారని వాపోయింది. కన్నీరు మున్నీరయ్యింది. దీన్ని రామ్‌ ప్రసాద్‌ కవర్‌ చేయడం విశేషం. మహిళలు, జబర్దస్త్ కమెడియన్లతో కలిసి ఆమె ధర్నాకి దిగింది. ఇందులో కొందరు విచిత్రమైన ఫ్లకార్డుల ప్రదర్శించారు. అందులో ఒక డిమాండ్‌ మాత్రం షాకిచ్చేలా ఉంది. 
 

అందులో `రష్మి డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలి` అనే డిమాండ్‌ ఉండటం విశేషం. మహిళలే ఆ ప్లకార్డులు ప్రదర్శించారు. దీన్ని జడ్జ్ కృష్ణభగవాన్‌ ప్రదర్శించారు. రష్మి డ్రెస్‌ తగ్గించాలని తాము డిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. దీంతోపాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ మళ్లీ రావాలని, సన్నీకి పెళ్లి అవుతుందా అనే ప్లకార్డులు కూడా ఉండటం విశేషం. 
 

ఇక తన డ్రెస్‌కి సంబంధించిన డిమాండ్‌పై రష్మి స్పందించింది. తాను కూడా అదే చెబుతున్నా అని, తగ్గిస్తానంటే వద్దంటున్నారంటూ పెద్ద షాకిచ్చింది రష్మి. తనకు డ్రెస్‌ సైజ్‌ తగ్గించాలని ఉన్నా, షో నిర్వహకులు వద్దు అంటున్నారనే అర్థంలో రష్మి గౌతమ్ ఆవేదన చెందింది. ఆమె బాధని చూసిన జడ్జ్ లు, కమెడియన్లు నవ్వులు పూయించడం విశేషం. ఇది లేటెస్ట్ జబర్దస్త్ కామెడీ షో ప్రోమోలోని విషయం. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వుల డోస్‌ పెరిగినట్టుగా ఉంది. 
 

Latest Videos

click me!