రోజూ రెండు రౌండ్లు వేస్తా, రాత్రికి మాత్రం అది కచ్చితంగా ఉండాల్సిందే.. నాగార్జున చెప్పిన రహస్యాలు..

Published : Jun 05, 2024, 05:28 PM IST

కింగ్‌, మన్మథుడు.. ఏదైనా నాగార్జునకే వర్తిస్తాయి. ఈ ఏజ్‌లోనే మన్మథుడిగానే ఉన్నాడు నాగ్‌. రాత్రి సమయంలో కచ్చితంగా ఫాలో అయ్యే రహస్యాలు బయటపెట్టాడు.   

PREV
15
రోజూ రెండు రౌండ్లు వేస్తా, రాత్రికి మాత్రం అది కచ్చితంగా ఉండాల్సిందే.. నాగార్జున చెప్పిన రహస్యాలు..

నాగార్జున అంటే ఫిట్‌నెస్‌కి కేరాఫ్‌. ఆయన ఫుడ్‌, డైట్‌ విషయంలో చాలా కేర్‌గా ఉంటారని అంతా అనుకుంటారు. ఆరు పదుల్లోకి దగ్గరలో ఉన్న నేపథ్యంలో ఇంకా ముప్పై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు నాగ్‌. ఆయన ఫిజిక్‌ మాత్రమే కాదు, ఆయన మాటలు, ఆయన సినిమాలు కూడా అలానే ఉంటాయి. ఆయన ఇప్పుడు లవ్‌ స్టోరీస్‌ చేసినా ఆకట్టుకుంటున్నారు. అలరిస్తున్నారు. 
 

25

ఇదిలా ఉంటే నాగార్జున ఫిట్‌ నెస్‌ గురించి చాలా విషయాలు చెప్పారు. ఆయన మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటారు, జ్యూసులు, ఫుడ్‌ తీసుకునే టైమింగ్స్ కూడా వెళ్లడించారు. త్వరగా ఫుడ్‌ తీసుకుంటానని కూడా తెలిపారు నాగార్జున. అనేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన షేర్‌ చేసుకున్నారు. ఈ క్రమంలో నాగ్ ఓ క్రేజీ రహస్యాలను వెల్లడించారు. 

35

ఇటీవల ప్రతి రోజూ ఆయన చేసే పనులు చెప్పారు. తీసుకునే ఫుడ్‌ మాత్రమే కాదు, ఆల్కహాల్‌ కూడా తీసుకుంటాడట. రోజూ రెండు రౌండ్లు వేస్తాడట. `నా సామి రంగం` టైమ్‌లో కీరవాణి, చంద్రబోస్‌లతో చేసిన చిట్‌చాట్‌లో ఈ విషయాలను తెలిపారు నాగ్‌. అన్ని రకాలు ఫుడ్‌ తీసుకుంటానని, పప్పు, రెండు మూడు రకాలు కూరగాయలు, నాన్‌ వెబ్‌, మటన్‌, చికెన్‌, ఫిష్‌ ఇలా అన్నీ తింటానని చెప్పాడు నాగ్‌. అన్నీ కడుపునిండా తింటాడట. 

45

అదే సమయంలో సాయంత్రం ఎర్లీగా ఫుడ్‌ తీసుకుంటాడట. ఏడు గంటల లోపే తాను తినాల్సింది తినేస్తాడట. అదే సమయంలో వైట్‌ రైస్‌కి బదులు బ్రౌన్‌ రైస్‌ తింటాడట నాగ్‌. దీంతోపాటు రోజూ రెండు రౌండ్లు మందేస్తానని కూడా చెప్పారు. అంతేకాదు రాత్రి సమయంలో మాత్రం ఒక్కటి మాత్రం కచ్చితంగా చేస్తాడట. రాత్రిళ్లు పడుకునే సమయంలో కచ్చితంగా ఆయన స్వీట్‌ తింటాడట. స్వీట్‌ తినడం తన అలవాటు, స్వీట్‌ తినకుంటే తనకు నిద్ర పట్టదని, కచ్చితంగా స్వీట్‌ తినాల్సిందే అన్నారు.  ప్రతి రోజూ ఇది ఫాలో అవుతాడట నాగ్‌. ఈ వీడియో క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

55

నాగార్జున చాలా రోజుల తర్వాత ఈ ఏడాది `నా సామి రంగ`తో హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మల్టీస్టారర్‌ మూవీస్‌ వైపు టర్న్ తీసుకున్నాడు. ప్రస్తుతం `కుబేర`లో కీలక పాత్రలో కనిపిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్‌తోనూ కలిసి నటిస్తున్నాడట. `కూలీ`లో నాగ్‌ కూడా ఉంటారని సమాచారం. మరోవైప తనకు `నాసామిరంగం` వంటి సక్సెస్‌ ఇచ్చిన దర్శకుడితోనే మరో సినిమా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి దాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు నాగ్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories