కొన్ని కాంబినేషన్స్ వింటానికి చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయి. కానీ అవి కార్యరూపం దాల్చవు. అలాంటి వాటిల్లో ఒకటి అనుష్క, ఎన్టీఆర్ కాంబినేషన్. వీరిద్దరు జంటగా ఒక్క సినిమా కూడా రాలేదు. అందుకు ప్రత్యేకమైన కారణం ఏమి లేదు కానీ అలా సెట్ అవ్వలేదు అంతే. అయితే అనుష్క కు మాత్రం ఎన్టీఆర్ తో చెయ్యాలని ఉందిట. ఈ విషయం ఆమే చెప్పింది.
29
ntr, anushka
తెలుగులో స్టార్ హీరో గా ఎదిగి హిందిలోకి కూడా ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెపపాల్సిన పని లేదు. ఈ హీరో చాలా మంది తెలుగు భామలతో జతకట్టాడు. కానీ ఒక అనుష్కతో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అనుష్క తో ఎన్టీఆర్ కాంబినేషన్ కు గతంలో కొందరు దర్శకులు ట్రై చేసారు. అనుష్క హవా నడుస్తున్న టైమ్ లో ఈ ప్రయత్నాలు జరిగాయని వినికిడి. అయితే వర్కవుట్ కాలేదు.
39
ntr, anushka
ఇక అనుష్క మాత్రం ఎన్టీఆర్ తో చేయటానికి మక్కువ చూపించింది. ఆ విషయం ఆమె స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. సీనియర్ నటి జయప్రద ఆమెతో ఓ ఇంటర్వూ చేసారు. గతంలో ఓ టీవి ఛానెల్ కోసం. అందులో భాగంగా మీకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరితో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే ప్రిఫరెన్స్ ఇస్తారు అంటే తడుముకోకుండా ఎన్టీఆర్ తో చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఆ కాంబినేషన్ మాత్రం కార్య రూపం దాల్చలేదు.
49
ntr, anushka
అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వచ్చేదుంది. కానీ లాస్ట్ మినిట్ లో మిస్సైంది. ఆ సినిమా ఏమిటంటే, గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమ దేవి సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.కానీ మూవీలోని పాత్రలను మాత్రం బాగా హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు.
59
Anushka Shetty
అయితే ఈ పాత్రకు ముందుగా, గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకుందాం అనుకున్నాడట. కానీ ఎన్టీఆర్ అంతగా ఇంట్రెస్ట్ చూపకపోవడంతో అల్లు అర్జున్‌కు ఈ అవకాశం వచ్చిందని చెప్తారు. అలా అనుష్క, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఈ మూవీ మిస్సైంది.
69
అలాగే ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు సెట్ అయినట్లే అయి తర్వాత మిస్సయ్యాయని తెలుస్తోంది. మొదటిగా చూస్తే విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయి చింతకాలయ రవి. ఈ సినిమాకు మొదటగా జూనియర్ ఎన్టీఆర్ ను హీరో అనుకున్నారు. కానీ ఆ సినిమాను యంగ్ టైగర్ తిరస్కరించాడు. కాకపోతే ఇదే సినిమాలో చిన్న అతిథి పాత్రలో మెరిశాడు.అలా ఈ కాంబినేషన్ కుదరలేదు.
79
ఇక ఊసరవెల్లి సినిమా జూనియర్ కెరీర్ లోనే భారీగా విడుదలైన సినిమా. దాదాపు అప్పట్లోనే 1800 స్క్రీన్లలో దీన్ని ప్రదర్శించి రికార్డ్ క్రియేట్ చేసారు. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా మొదట అనుష్కనే అనుకున్నారు. పాత్ర నచ్చకపోవడంతో ఆమె దీన్ని తిరస్కరించింది. తర్వాత తమన్నా దగ్గరకు కథ వెళ్లగా ఆమె ఓకే చెప్పింది. ఆ విధంగా తారక్, అనుష్క కాంబినేషన్ లో మరో సారి మిస్సయింది.
89
ఇక వీరి కాంబినేషన్ మిస్సైన నాలుగో సినిమా.. జనతా గ్యారేజ్. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రంలో సమంత పోషించిన పాత్రకోసం ముందుగా అనుష్కను అనుకొని ఆమెను సంప్రదించారు మేకర్స్. అయితే అనుష్క ఈ పాత్రను కూడా తిరస్కరించింది. తర్వాత సమంత దగ్గరకు ఆ రోల్ వెళ్లగా ఆమె ఎంపిక చేసుకుంది.
99
అలా తారక్-అనుష్క కాంబినేషన్ లో నాలుగు సినిమాలు మిస్సయ్యాయి. అభిమానులు ఎంతగా ఎదురుచూసినప్పటికీ వీరిద్దరి కాంబోలో సినిమా మాత్రం రాలేదు.ఇక ఇప్పుడు అనుష్క ...ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అయ్యేందుకు అవకాసం లేదు.