Sowmya Rao: బ్లూ గౌనులో కేకపెట్టిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ.. కొత్త యాంకర్‌ అందాలకి కుర్రాళ్లు బేజార్

Published : Jan 06, 2023, 03:49 PM ISTUpdated : Jan 06, 2023, 04:13 PM IST

జబర్దస్త్ కొత్త యాంకర్‌ సౌమ్య రావు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. షోకి కొత్త కళని తీసుకొస్తున్నారు. అనసూయ స్థానంలో వచ్చిన ఈ బ్యూటీ గ్లామర్ షోలోనూ ఆమెనే ఫాలో అవుతుందనిపిస్తుంది.   

PREV
17
Sowmya Rao: బ్లూ గౌనులో కేకపెట్టిస్తున్న `జబర్దస్త్` బ్యూటీ.. కొత్త యాంకర్‌ అందాలకి కుర్రాళ్లు బేజార్

`జబర్దస్త్` కామెడీ షో కోసం ప్రతి వారం ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటారు. తాజాగా బ్లూ గౌన్‌లో హోయలు పోయింది సౌమ్య రావు. ట్రెండీ గౌనులో మెరిసిపోతూ మతిపోయేలా పోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. 
 

27

ఇందులో సౌమ్య రావు చాలా హాట్‌ గా ఉంది. ఆమె అందం మరింతగా పెరిగిపోయింది. కిల్లింగ్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. బ్లాక్ అండ్‌ వైట్‌లో దిగిన మరో ఫోటో పిచ్చెక్కించేలా ఉంది. నెటిజన్ల బాడీలో హీటు పెంచేలా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

37

సౌమ్య రావు జబర్దస్త్ షోకి యాంకర్‌గా రావడం లక్కీగా చెప్పాలి. ఆమె 500వ స్పెషల్‌ ఎపిసోడ్‌కి యాంకర్‌గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. అందుకే జబర్దస్త్ లవర్స్ కి స్పెషల్‌గా మారింది. ఈవిషయంలో నెటిజన్లు సైతం కామెంట్‌ చేస్తున్నారు. మీరు అదృష్టవంతురాలంటూ ప్రశంసిస్తున్నారు. 
 

47

మరోవైపు ఆమె లుక్‌పై కూడా కామెంట్లు చేస్తున్నారు. లుక్‌, హెయిర్‌ స్టయిల్‌ బాగుందట. కళ్లు అందంగా ఉన్నాయని, కిల్లింగ్‌ లుక్స్ అంటున్నారు. నీ యాంకరింగ్‌ సూపర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. 
 

57

అనసూయ స్థానంలో `జబర్దస్త్`షోకి యాంకర్‌గా వచ్చింది సౌమ్య రావు. దాదాపు రెండు నెలలు అవుతున్నా, అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తుంది. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆమె వచ్చీ రాని తెలుగు మాటలు ఆకట్టుకుంటున్నాయి. పైగా హైపర్‌ ఆదితో కలిసి చేసే రచ్చ ఆకట్టుకుంది. 
 

67

అయితే ప్రారంభంలో ఉన్న ఊపు ఇప్పుడు కనిపించడం లేదనే టాక్‌ కూడా వినిపిస్తుంది. సౌమ్య రావు ముద్దు ముద్దుగా బాగానే యాంకరింగ్ చేస్తున్నా, హైలైట్‌ అయ్యేలా ఆమె సందడి కనిపించడం లేదనే కామెంట్లు వస్తున్నాయి. అనసూయ హాట్‌ నెస్‌తో వార్తల్లో నిలిచేది. ఆమె డ్రెస్సు కాంట్రవర్సీగా మారేది. అలా అనసూయతోపాటు షో కోసం చర్చల్లో నిలిచేది. 
 

77

కానీ సౌమ్య రావు ఆ స్థాయి గ్లామర్‌ షో చేయడం లేదు. పరిమితుల్లోనే ఆమె పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. అయినా ఈ బ్యూటీ కోసం కుర్రాళ్లు ఎగబడుతుండటం విశేషం. మున్ముందు ఈ నాజూకు అందాల భామ రచ్చ చేస్తుందేమో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories