ఆల్రెడీ అతడికి పెళ్లైంది, రాత్రి ఫోన్ చేసి ఒంటరిగా రమ్మన్నాడు.. సింగర్ పై నటి సంచలన వ్యాఖ్యలు

Published : Jan 06, 2023, 03:07 PM IST

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా హీరోయిన్లకు, నటీమణులకు వేధింపులు ఎదురుకావడం చూస్తూనే ఉన్నాం.

PREV
16
ఆల్రెడీ అతడికి పెళ్లైంది, రాత్రి ఫోన్ చేసి ఒంటరిగా రమ్మన్నాడు.. సింగర్ పై నటి సంచలన వ్యాఖ్యలు

చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన గొడవలు జరుగుతూనే ఉంటాయి. టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని చోట్లా హీరోయిన్లకు, నటీమణులకు వేధింపులు ఎదురుకావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో యువ హీరోయిన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపి ప్రకంపనలు రేపింది. 

26

ఈ సంఘటన భోజ్ పురి ఇండస్ట్రీలో జరిగింది. ప్రముఖ భోజ్ పురి హీరోయిన్ యామిని సింగ్.. తాను ప్రముఖ సింగర్, హీరో పవన్ సింగ్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించింది. పవన్ సింగ్ పై ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. 

36

చాలా రోజుల క్రితమే తాను ఇకపై పవన్ సింగ్ చిత్రాల్లో నటించనని యామిని సింగ్ ప్రకటించింది. పవన్ సింగ్ చిత్రాల్లో హీరోయిన్లకు సరైన పాత్రలు దక్కవని అందుకే అయన చిత్రాల్లో నటించనని యామిని గతంలో తెలిపింది. కానీ అసలు కారణం అది కాదు.. నేను పవన్ సింగ్ చిత్రాల్లో నటించకపోవడానికి వేరే కారణం ఉంది. పవన్ సింగ్ నన్ను లైంగికంగా వేధించాడు. 

46

పవన్ సింగ్ వల్లే నాకు ఇండస్ట్రీలో అవకాశం వచ్చింది అని అంతా చెప్పుకుంటుంటారు. కానీ అది వాస్తవం కాదు. నా దర్శకుల వల్లే నాకు ఆఫర్స్ వచ్చాయి. అయితే పవన్ సింగ్ ని మొదటి సారి కలిసే వరకు అతడు మంచి సింగర్, నటుడు.. అలాగే మంచి వ్యక్తి అనే భావించా. కానీ అతడు నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగాడు. 

56

మీ ఇంట్లో ఆడబిడ్డని ఇలాగే అడిగితే అతడిని అభిమానిస్తారా అని యామిని సింగ్ ప్రశ్నించింది. ఒక రోజు రాత్రి 9 గంటలకు పవన్ సింగ్ నాకు ఫోన్ చేశాడు. అతడు ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి. అయినా కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆటోలో స్టూడియో వద్దకు ఒంటరిగా రావాలని అడిగాడు. కాంప్రమైజ్ కావాలని చెప్పి నన్ను లైంగికంగా వాడుకోవాలని చూశాడు. 

66

కానీ నేను రానని తేల్చి చెప్పేశాను. అయితే సినిమాలో ఛాన్స్ ఉండదు అని బెదిరించాడు. నేను కాల్ కట్ చేసి ఆ చిత్రం నుంచి తప్పుకున్నట్లు యామిని సింగ్ పేర్కొంది. యామిని సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం భోజ్ పురి ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. యామిని ఆరోపణలపై పవన్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

click me!

Recommended Stories