పింక్‌ డ్రెస్‌లో `జబర్దస్త్` యాంకర్‌ మత్తెక్కించే పోజులు.. అనసూయని సౌమ్యరావు రీప్లేస్‌ చేసినట్టేనా ?

Published : Jan 20, 2023, 02:20 PM IST

`జబర్దస్త్` కామెడీ షోకి కొత్తగా వచ్చిన యాంకర్‌ సౌమ్య రావు తనదైన స్టయిల్లో దూసుకుపోతుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకర్షిస్తుంది. నిత్యం సోషల్‌ మీడియా ద్వారా ఎంగేజ్‌ చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 

PREV
18
పింక్‌ డ్రెస్‌లో `జబర్దస్త్` యాంకర్‌ మత్తెక్కించే పోజులు.. అనసూయని సౌమ్యరావు రీప్లేస్‌ చేసినట్టేనా ?

యాంకర్‌ సౌమ్య రావు పింక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసే పోజులిచ్చింది. కిల్లర్‌ లుక్‌లో కుర్రాళ్ల మతిపోగొడుతున్న తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. ప్రతి వారం ఇలా గ్లామర్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది సౌమ్య రావు. 
 

28

దీనికితోడు రెగ్యూలర్‌గా రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఓవైపు గ్లామర్‌ ఫోటోలు, మరోవైపు రీల్స్ తో అదరగొడుతుందీ హాట్‌ యాంకర్‌. నాజుకూ అందాలతో కనువిందు చేస్తుంది. కిల్లింగ్‌ లుక్‌లో కనువిందు చేస్తుంది. మొత్తంగా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 
 

38

ఇంకోవైపు `జబర్దస్త్` కామెడీ షోలో తనదైన పంచ్‌లో హైలైట్‌గా నిలుస్తుంది. తనకు కౌంటర్లు వేసే వారికి అదిరిపోయే కౌంటర్లు, పంచ్‌లు వేస్తూ వాహ్‌ అనిపిస్తుంది. షోలో రచ్చ చేస్తుంది. తనపై కౌంటర్లు వేయాలంటేనే హడలెత్తిపోవాల్సిందే అనేట్టుగా ఆమె పంచ్‌లుండటం విశేషం. 
 

48

ఇదిలా ఉంటే ఇటీవల కృష్ణభగవాన్‌కే మతిపోగొట్టింది. ఇంత మంది బుర్రలు తింటూ మీరు నాన్‌ వెజ్‌ తిననంటారేంటి సర్‌ అని షాకిచ్చింది. దానికి కృష్ణభగవాన్‌ మరో పంచ్‌తో దాన్ని బ్యాలెన్స్ చేశారు. కానీ ఆ దెబ్బకి పక్కన ఉన్న ఇంద్రజ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. 
 

58

మరోవైపు `జబర్దస్త్` షోకి అనసూయ స్థానంలో సౌమ్య రావు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తింది. చాలా వరకు సౌమ్య రావు అందం విషయంలో పాజిటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. కానీ యాంకర్‌గా ఆమె స్థాయిలో రాణించలేకపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 

68
Hyper Aadi-Sowmya Rao

ప్రారంభంలో రెండుమూడు ఎపిసోడ్లు హైపర్‌ ఆదితో కలిసి పంచ్‌లు వేసింది. ఆయనకే దిమ్మతిరిగేలా చేసింది. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయింది. అందరి చూపు సౌమ్యరావు పైనే అనేట్టుగా, ఎంత ముద్దుగా మాట్లాడుతుందో అని వేచి చేసేవాళ్లు. ఆమె కోసం ఎపిసోడ్లు చూసే వాళ్లు పెరిగారు. కానీ రాను రాను ఆ జోరు, ఆ హుషారు కనిపించడం లేదు. హైపర్‌ ఆది లేకపోవడమా? ఏంటో తెలియదుగానీ, ఆ కిక్స్ లేదనే టాక్‌ వినిపిస్తుంది. ఆడియెన్స్ నుంచి పెదవి విరుపు కనిపిస్తుంది. 
 

78

తనపై పలు బాడీ షేమింగ్‌ కామెంట్లు చేయడం, వల్గర్‌ కామెంట్లు చేయడం పట్ల అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు భరించిన ఆమె ఇకపై తాను కొనసాగలేనంటూ గతేడాది చివర్లో `జబర్దస్త్`కి గుడ్‌బై చెప్పింది. కమెడియన్ల పంచ్‌లు, కామెంట్ల విషయంలోనే తను అభ్యంతరం వ్యక్తంచేసింది. మల్లెమాల వాటిని కట్‌ చేయకుండా అలాగే ప్లే చేశారని, పలు మార్లు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా లాభం లేదని, అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపింది అనసూయ.
 

88
Anasuya Bharadwaj

అయితే ఆమెపై నెటిజన్ల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. వాటిని లెక్క చేయక తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది అనసూయ. ప్రస్తుతం ఆమె నటిగా బిజీగా ఉంది. సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ రాణిస్తుంది. తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోనూ సినిమాలు చేస్తుండటం విశేషం. ఓ వైపు సినిమాలు, మరోవైపు షాపింగ్‌ మాల్స్ ఓపెనింగ్స్ తో బిజీగా ఉంది. మంచి ఎగ్జైటింగ్‌ షోస్‌ వస్తేనే యాంకరింగ్‌ చేస్తానని చెప్పింది అనసూయ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories