జబర్దస్త్ కమెడియన్ నరేష్ అసలు వయసు తెలుసా.. ఆయన భార్య ఎవరో, ఎలా దూరం అయ్యిందో తెలిస్తే షాక్ అవుతారు!

First Published Jul 11, 2021, 2:29 PM IST


జబర్దస్త్ కమెడియన్స్ లో పొట్టి రమేష్ గురించి తెలియనివారుండరు. నాటీ నరేష్ గా ఫేమస్ అయిన ఈ కమెడియన్ జబర్దస్త్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. రెండున్నర అడుగుల నరేష్ చేసే కామెడీ ప్రేక్షకులను కడుఫుబ్బా నవ్విస్తుంది. 
 

జబర్దస్త్ తో పాటు అనుభవించు రాజా ప్రోగ్రామ్ తో బాగా ఫేమస్ అయ్యాడు నరేష్. ఇటీవల ప్రారంభమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాం లో కూడా నరేష్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
undefined
బుల్లితెరపై కమెడియన్ గా ఇంత ఫేమస్ అయిన నరేష్ వయసు తెలిస్తే షాక్ కావలసిందే. కారణం చాలా పొట్టిగా ఉండే నరేష్ జబర్దస్త్ స్కిట్స్ లో చిన్న పిల్లాడు గెటప్స్ వేస్తూ ఉంటాడు. పెద్ద వాడిగా మొగుడు, అల్లుడు, డాన్ క్యారెక్టర్స్ చేసినా అతన్ని చిన్న పిల్లాడి వలె ప్రేక్షకులు భ్రమ పడుతూ ఉంటారు.
undefined
నిజానికి నరేష్ మనం అనుకుంటున్నట్లు బాలుడు కాదు. అతని ప్రస్తుత వయసు 22ఏళ్లకు చేరుకుంది. నరేష్ పొట్టివాడు కావడంతో అతని వయసు కనిపించడం లేదు. మరో ఆసక్తికర సంగతి ఏమిటంటే అతనికి పెళ్లి కూడా అయ్యింది.
undefined
2015లో తిరుపతాంబిక అనే అమ్మాయిని నరేష్ వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లు వీరి వివాహ బంధం సవ్యంగానే సాగింది. కారణం ఏమిటో తెలియదు కానీ, నరేష్ వైఫ్ ఆత్మహత్య చేసుకొని మరణించారు. తిరుపతాంబ నరేష్ కంటే వయసులో పెద్దదని సమాచారం.
undefined
ఈ సంఘటన నరేష్ ని విషాదంలో నింపివేసింది. అలాగే అనేక ఇబ్బందులకు కారణం అయ్యింది. ప్రస్తుతం నరేష్ సింగిల్ గానే ఉంటున్నట్లు సమాచారం. ఐతే బుల్లితెరపై క్రేజీ కమెడియన్స్ లో నాటి నరేష్ ఒకరిగా ఎదిగారు.
undefined
బుల్లెట్ భాస్కర్ టీమ్ లో నాటీ నరేష్ చేసిన పాత్రలు కడుపుబ్బా నవ్వించాయి. లేడీ గెటప్స్ కూడా అద్భుతంగా చేయగల నరేష్, ఇతర టీమ్స్ లో కూడా చేస్తున్నారు.
undefined
వెండితెరపై స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకోవాలనేది నరేష్ డ్రీమ్. దాని కోసం తనని తాను నిరూపించుకునే ప్రయత్నాలలో నరేష్ ఉన్నాడు.
undefined
బుల్లితెరపై మాత్రం నరేష్ కమెడియన్ గా దూసుకుపోతున్నారు. ఆయనకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. జబర్దస్త్ తో పాటు అనేక బుల్లితెర షోలలో కనిపిస్తూ, సందడి చేస్తున్నారు.
undefined
ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.  ఇక వరంగల్ ప్రాంతానికి చెందిన నరేష్... డిగ్రీ చదువుతూ మధ్యలో మానేశారు. పెద్దగా చదువు లేకున్నా నటనపై మక్కువతో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చి  ఫేమస్ అయ్యేడు నరేష్.
undefined
click me!