పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. సత్యశ్రీ, వర్ష, రోహిణి లాంటి అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం జరిగింది. తెలుగమ్మాయి అయిన రీతూ మోడల్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె కెరీర్ సీరియల్ నటిగా మొదలైంది. ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించారు. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.