పలుచని డ్రెస్ అందాలన్నీ కనిపోయించేలా అషురెడ్డి పోజులు... ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో?

Published : Jul 29, 2023, 03:46 PM IST

అషురెడ్డి వరుస ఫోటో షూట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతుంది. ఆ విధంగా ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.  

PREV
18
పలుచని డ్రెస్ అందాలన్నీ కనిపోయించేలా అషురెడ్డి పోజులు... ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో?
Ashu Reddy

కాగా అషురెడ్డి అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది.  జూనియర్ సమంతగా సోషల్ మీడియాను షేక్ చేసిన అషురెడ్డి బిగ్ బాస్ షోతో పాపులారిటీ రాబట్టింది. సోషల్ మీడియా స్టార్ కాస్తా బుల్లితెర సెలబ్రిటీ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అయితే పెద్దగా రాణించలేదు. కొద్దిరోజులకే ఎలిమినేట్ అయ్యింది. 


 

28
Ashu Reddy

హౌస్లో అందాలు ఆరబోసినప్పటికీ ఆడియన్స్ షాక్ ఇచ్చారు. కొద్దివారాలకే ఇంటి నుండి బయటకు పంపేశారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కి అషురెడ్డి దగ్గరయ్యారు. వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ బంధం పేరేమిటో తెలియదు. 

38
Ashu Reddy

అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో సైతం అషురెడ్డి పాల్గొన్నారు. ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది. డిజిటల్ వర్షన్ కూడా అషురెడ్డికి కలిసి రాలేదు. తక్కువ వారాల్లోనే ఆమె ఎలిమినేట్ అయ్యారు.

 

48

ఈ మధ్య బుల్లితెరపై అషురెడ్డి సందడి తగ్గింది. టెలివిజన్ షోస్ లో పెద్దగా కనిపించడం లేదు. కొంతకాలం స్టార్ మా, ఈటీవీలో షోస్ లో అషురెడ్డి కనిపించారు. కారణం తెలియదు కాదు ఆమెను పట్టించుకోవడం మానేశారు. సోషల్ మీడియాలో మాత్రమే అషురెడ్డి అందుబాటులో ఉంటున్నారు.

58

ఇటీవల అషురెడ్డి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కబాలి చిత్ర నిర్మాత కేపీ చౌదరి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. విచారణలో ఓ 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. పలువురు చిత్ర ప్రముఖులు రాజకీయవేత్తలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 

 

68
Ashu Reddy

అషురెడ్డి, సురేఖావాణి, నటి జ్యోతిలతో కేపీ చౌదరి వందల సార్లు ఫోన్ మాట్లాడినట్లు తెలిసింది. అలాగే కేపీ చౌదరితో సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత, అషురెడ్డి, జ్యోతి సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరికి కూడా డ్రగ్ దందాతో సంబంధం ఉండే అవకాశం కలదంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

78

కాగా డ్రగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా దుష్ప్రచారం చేస్తున్నారని మీడియా మీద అషురెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. అషురెడ్డి మాట్లాడుతూ... కొద్దిరోజులుగా నేను మానసిక వేదన అనుభవిస్తున్నాను. మీడియా ఛానల్స్ నాకు సంబంధం లేని వ్యవహారంలో నా పేరు తీస్తున్నారు. ఏకంగా నా ఫోన్ నెంబర్ బహిర్గతం చేశారు. 

 

88

నాకు నిమిషానికో ఫోన్ వస్తుంది. నేను ఫోన్ వాడటం మానేశాను. మీడియా సంస్థలు నాపై చేసిన ప్రసారాలు తొలగించాలి. లేదంటే నేను న్యాయపోరాటం చేస్తాను. పరువు నష్టం దావా వేస్తాను. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ నష్టపోయేలా చేస్తాను. మీరు ఇష్టం వచ్చిన ప్రచారం చేయడం వలన మా కుటుంబాలు, కెరీర్లు నాశనం అవుతాయి. ఈ వార్తలు రాసే వాళ్లకు ఫ్యామిలీలు లేవా..?, అంటూ మండిపడ్డారు. 

click me!

Recommended Stories