చీరకట్టులో కట్టిపడేస్తున్న ‘కేజీఎఫ్’ హీరోయిన్.. శ్రీనిధి మళ్లీ వెండితెరపై మెరిసేదెప్పుడో..

First Published | Jul 29, 2023, 3:33 PM IST

కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) మూడు చిత్రాలతో మురిపించి మయామైంది. మళ్లీ ఈ ముద్దుగుమ్మ వెండితెరపై ఎప్పుడు మెరుస్తుందనే ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. 
 

భారీ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘కేజీఎఫ్‘ ఛాప్టర్ 1, 2 చిత్రాలతో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అలరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుద కావడంతో శ్రీనిధికి దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఫలితంగా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది.
 

అయితే, ఆ తర్వాత ‘కోబ్రా’ చిత్రంలో మెరిసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా శ్రీనిధి పాత్ర కూడా అంతలా ఆసక్తికరంగా లేకపోవడంతో పెద్దగా ప్లస్ కాలేదనే చెప్పాలి. ఇలా మొత్తంగా శ్రీనిధి మూడు సినిమాలు చేసి మయామైంది. 
 


కేజీఎఫ్ ఇచ్చిన సక్సెస్ తో శ్రీనిధి త్వరలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంటుందని భావించారు. కానీ ప్రస్తుతం చేతిలో ఒక్కసినిమా లేకపోవడం గమనార్హం. తనే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందేమోననే సందేహం లేకుండా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ మెరుస్తూనే వస్తోంది. 
 

ఈ ముద్దుగుమ్మ మళ్లీ వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ గతేడాది నుంచి  శ్రీనిధి నుంచి ఎలాంటి సినిమా అప్డేట్స్ లేవు. పైగా ఎక్కడా నామమాత్రంగానైనా ఈ బ్యూటీ పేరు వినిపించడం లేదు. దీంతో ఈమె కెరీర్ ముందుకు సాగుతుందా? అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

మరోవైపు శ్రీనిధి మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. అలాగే సంప్రదాయ దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 
 

తాజాగా శ్రీనిధి చీరకట్టులో మెరిసింది. ట్రాన్స్ ఫరెంట్ శారీలో కేజీఎఫ్ బ్యూటీ మంత్రముగ్ధులను చేసింది. ట్రెడిషనల్ వేర్ లోనూ మత్తెక్కించే ఫోజులతో మైమరిపించింది. మత్తు చూపులతో నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేసింది. గ్లామర్ షోకు మాత్రం దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్ లో మాత్రం మెరుస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

Latest Videos

click me!