Rithu Chowdary: నాన్న చావు ముందే నిర్ణయింపబడింది, నా పక్కనే అలా... జరిగింది ఇదే, కన్నీరు మున్నీరైన రీతూ!

Published : Nov 17, 2023, 10:16 AM ISTUpdated : Nov 17, 2023, 11:03 AM IST

ఈ ఏడాది రీతూ చౌదరి తండ్రి హఠాన్మరణం పొందిన సంగతి తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తండ్రి చనిపోయిన రోజు అసలు ఏం జరిగిందో చెబుతూ రీతూ చౌదరి కన్నీరు పెట్టుకుంది.   

PREV
18
Rithu Chowdary: నాన్న చావు ముందే నిర్ణయింపబడింది, నా పక్కనే అలా... జరిగింది ఇదే, కన్నీరు మున్నీరైన రీతూ!
Rithu Chowdary (Pic Credit: Suman Tv)

రీతూ చౌదరి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తల్లితో పాటు పాల్గొన్నారు. అమ్మకు ప్రేమతో అనే ఈ షోలో యాంకర్ దూరమైన తండ్రి గురించి రీతూ చౌదరిని అడిగారు. తండ్రిని తలచుకుని రీతూ చౌదరి ఎమోషనల్ అయ్యింది. ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించింది... 

 

28
Rithu Chowdary

రీతూ చౌదరి మాట్లాడుతూ... నాన్నమ్మ మొదటి వర్ధంతి చేసేందుకు సొంత ఊరు వెళదాం అని నాన్నతో అన్నాను. వద్దులేమ్మా నాకు కూడా ఓపిక లేదు అన్నారు. ఆయన చెప్పలేక పోతున్నాడేమో అని నేనే బలవంతం చేసి తీసుకెళ్ళాను. ఆ రోజు రాత్రి నాన్న ఉత్సాహంగా ఉన్నారు. ఆయన మీద జోక్స్ వేశాము. 

38
Rithu chowdary

నాన్న చావు ముందుగానే నిర్ణయించబడిందేమో అనిపిస్తుంది. అమ్ములు నువ్వు త్వరగా నిద్రపో రేపు ఉదయాన్నే యూట్యూబ్ వీడియో చేయాలని నాన్న అన్నారు. నేను నిద్రపోయాను. ఆయన గుండె నొప్పితో బాధపడుతున్నప్పుడు నా పక్కనే పడుకుని ఉన్నారట. నాకు మాత్రం తెలియదు. నన్ను నిద్ర లేపవద్దు అని అన్నారట. 


 

48
Rithu Chowdary

ఉదయాన్నే మా బాబాయ్ నాన్న చనిపోయారని చెప్పారు. నేను నా మొదటి సంపాదనతో కొన్న కారు అంటే నాన్నకు చాలా ఇష్టం. అందులోనే ఆయన కన్నుమూశారు. అందుకే ఇప్పుడు కారులో ఒంటరిగా వెళుతుంటే ఆయన ఉన్నట్లే ఫీల్ అవుతాను. మాట్లాడతాను... అన్నారు. 

58
Rithu Chowdary

రీతూ మాటలు కనీరు పెట్టించాయి. రీతూ చౌదరి తల్లి కూడా భర్త గురించి మాట్లాడారు. రీతూ చౌదరి పనులన్నీ ఆయనే చూసుకునేవారు. ఉదయాన్నే వేడి నీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేయడం నుండి అన్నీ చేసేవారు. ఇప్పుడు ఆయన లేరు. అన్ని మారిపోయానని రీతూ చౌదరి తల్లి అన్నారు. 
 

68
Rithu Chowdary

రీతూ చౌదరి ఒకప్పుడు సీరియల్స్ నటించేవారు. ఆమెకు అక్కడ ఆశించిన గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ కమెడియన్ గా మారింది. హైపర్ ఆది టీమ్ లో రీతూ చౌదరి ఎక్కువగా కనిపించారు. జబర్దస్త్ వేదికగా ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి ప్రస్తుతం ఆ కామెడీ షోలో చేయడం లేదు. 
 

78
Rithu Chowdary

రీతూ చౌదరి రిలేషన్ లో ఉంది. శ్రీకాంత్ అనే వ్యక్తితో రీతూ చౌదరి తరచూ కనిపిస్తారు. శ్రీకాంత్ ని ఆమె పెళ్లి చేసుకుంటారనే వాదన ఉంది. ఆ మధ్య బ్రేకప్ అయినట్లు వార్తలు వచ్చాయి. కొన్నాళ్ళు రీతూ అతన్ని దూరం పెట్టింది. మరలా కలిసిపోయారు. 

 

88
Rithu Chowdary

రీతూ చౌదరి ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. హాట్ ఫోటో షూట్స్ తో ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. ఇంస్టాగ్రామ్ సెలెబ్స్ కి ఆదాయ మార్గం అయ్యింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ప్రమోషనల్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు.

తమన్నా సినిమాకు నెగిటివ్ రివ్యూలు..కోర్టుకెళ్లిన నిర్మాతలు

click me!

Recommended Stories