బయటపడ్డ రీతూ చౌదరి బాగోతం... అమ్మకు తెలియకుండా అలాంటి పనులు, వీడియో వైరల్ 

Published : Jan 21, 2024, 08:30 AM IST

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి అమ్మకు తెలియకుండా ఫ్రెండ్స్ తో అలాంటి పనులు చేస్తుందట. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.   

PREV
15
బయటపడ్డ రీతూ చౌదరి బాగోతం... అమ్మకు తెలియకుండా అలాంటి పనులు, వీడియో వైరల్ 
Rithu Chowdary


రీతూ చౌదరికి సోషల్ మీడియాలో బోల్డ్ ఇమేజ్ ఉంది. ఈమె శృతి మించిన గ్లామర్ షో చేస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా తరచుగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తుంది. రీతూ చౌదరి ఫోటోల మీద జనాలు నెగిటివ్, వల్గర్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. 

 

25
Rithu Chowdary

తాజాగా ఆమె మరో వీడియో షేర్ చేసింది. అమ్మకు తెలియకుండా అలాంటి పనులు చేస్తున్నాను అనే అర్థంలో ఆ వీడియో ఉంది. విషయంలోకి వెళితే రీతూ చౌదరి ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మందు కొడుతూ పబ్స్ లో ఎంజాయ్ చేస్తుందట. 
 

35
Rithu Chowdary

కానీ వాళ్ళ అమ్మ ముందు మాత్రం పూజలు, పునస్కారాలు చేసే పద్ధతి గల అమ్మాయిగా కలరింగ్ ఇస్తుందట. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు ఇలా... అమ్మ ముందు ఇలా... అంటూ ఒక వీడియో షేర్ చేసింది. సదరు వీడియో మీద నెటిజెన్స్ తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు. 

 

45
Rithu Chowdary

రీతూ చౌదరి సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. కొన్ని సీరియల్స్ లో ఆమె నటించారు. బ్రేక్ రాకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. హైపర్ ఆది టీమ్ లో కొన్నాళ్ళు స్కిట్స్ చేసింది. జబర్దస్త్ పాపులర్ షో కావడంతో అనతికాలంలో ఆమెకు ఫేమ్ వచ్చింది. 
 

55
Rithu Chowdary


ఫేమ్ వచ్చాక ఇంస్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్ లో రీతూ చౌదరినీ వన్ మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. మరోవైపు నటిగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వ్యూహం సిరీస్లో రీతూ చౌదరి ఓ రోల్ చేసింది. 
 

click me!

Recommended Stories