మగ జాతికి అనసూయ బోల్డ్ ఛాలెంజ్... మీరు అది చేయగలరా అంటూ ఓపెన్, మామూలు గట్స్ కాదు!

Published : Jan 21, 2024, 07:42 AM IST

అనసూయ భరద్వాజ్ గట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజా ఆమె మొత్తంగా మగ జాతికి ఒక ఛాలెంజ్ విసిరింది. అది చేసే దమ్ము మీకు ఉందా అని నేరుగా ప్రశ్నించింది.   

PREV
17
మగ జాతికి అనసూయ బోల్డ్ ఛాలెంజ్... మీరు అది చేయగలరా అంటూ ఓపెన్, మామూలు గట్స్ కాదు!


అనసూయ ఫెమినిస్ట్. అలాగే ఆమె డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. తనపై వచ్చే సోషల్ మీడియా నెగిటివిటీకి తనదైన శైలిలో కౌంటర్స్ ఇస్తుంది. ఎవరేమన్నా నచ్చినట్లు బ్రతకడమే జీవితం అంటుంది. ఒకరికి నచ్చినట్లు మనం బ్రతక కూడదు అంటుంది. 

 

27

అనసూయ పలు విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్నారు. వాటిలో ఆమె డ్రెస్సింగ్ ఒకటి. తెలుగు బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన ఘనత అనసూయదే. ఆ విషయంలో ఆమె ట్రెండ్ సెట్టర్. జబర్దస్త్ వేదికగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేసింది. 

37
Anasuya bharadwaj

కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే షోలో ఇలాంటి బట్టలు ధరించడం ఏమిటంటూ అనసూయ మీద జనాలు ఫైర్ అయ్యారు. ఎంతగా విమర్శల దాడి జరిగినా అనసూయ వెనక్కి తగ్గలేదు. పైగా తనని తాను సమర్థించుకుంది. 

 

47
Anasuya Bharadwaj Hot Photos

నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి బట్టలైనా ధరిస్తా... మీకేంటి ఇబ్బంది. మీకు నచ్చినట్లు నేను ఉండను... అని నేరుగా ప్రశ్నించింది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఓ సందర్భంలో... అనసూయ ఎలాంటి బట్టలేసినా అందంగా ఉంటుంది. పొట్టిబట్టలే వేయాల్సిన అవసరం లేదు అన్నాడు. 
 

57

వయసులో పెద్దోడు అని కూడా చూడకుండా ఇచ్చి పడేసింది. జబర్దస్త్ వదిలేశాక ఇంస్టాగ్రామ్ వేదికగా తన గ్లామర్ షో కొనసాగిస్తోంది. కాగా ఈ విషయంలో మగాళ్లకు ఆమె ఓ సవాల్ విసిరింది. అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా ఈ ఛాలెంజ్ చేసింది. 

 

67
Anasuya bharadwaj

మహిళలు చీరలు కట్టుకుని భారతీయ సంస్కృతిని కాపాడాలని భావించే మగాళ్లు.. వారు కూడా పంచెలు, ధోతి వంటి సాంప్రదాయ దుస్తులు ధరించాలి, అని ఓ వ్యక్తి చెబుతున్న వీడియో షేర్ చేసింది. ఆడవాళ్ళ నుండి సాంప్రదాయ కట్టు ఆశించే మగాళ్లు కూడా అది ఫాలో అవ్వాలి. మీరు అలా చేయగలరా అంటూ సవాల్ విసిరింది.. 

77


అనసూయ సవాల్ రీజనబుల్ గా ఉంది. ఆడవాళ్లే సంస్కృతిని కాపాడాలా? మగాళ్లకు ఆ అవసరం లేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఈ విషయంలో అనసూయకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ లేదు. అంత లాజికల్ గా ఆమె సవాల్ ఉందన్నమాట. అనసూయ మజాకా!
 

Read more Photos on
click me!

Recommended Stories