Jabardasth : కరోనా వల్ల మరణం వరకు వెళ్లిన జబర్దస్త్ కమెడియన్, తాగుబోతు రాజమౌళి ని కాపాడింది ఎవరో తెలుసా?

Published : Jan 21, 2026, 02:25 PM IST

జబర్దస్త్ లో స్టార్ కమెడియన్.. చేతి నిండా సంపాదన.. కానీ కరోనా వల్ల కుటుంబం ప్రమాదంలో పడింది. తాగుబోతు పాత్రకు బ్రాండ్ గా మారిన రాజమౌళి పరిస్థితి చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంది. ఆ టైమ్ లో ఆపన్న హస్తం అందించిన వ్యక్తి ఎవరో తెలుసా? 

PREV
15
సామాన్యులను స్టార్స్ గా మార్చిన జబర్దస్త్..

జబర్దస్త్ వల్ల చాలామంది స్టార్లు గామారారు. మారుమూలన దాగున్న ట్యాలెంట్ బయటకు వచ్చింది. పంచులు వేయగలిగి.. సరైన ఆసరాలేని కమెడియన్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది జబర్దస్త్. ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది సామాన్యులు.. ప్రస్తుతం సెలబ్రిటీలుగా మారారు. చేతి నిండా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు కడుపునిండా తిండికి ఇబ్బందిపడ్డవారు కూడా .. ప్రస్తుతం కార్తలో తిరుగుతున్నారు. అయితే ఈ నవ్వల వెనుక ఎంతో కష్టం దాగి ఉంది. ఎన్నో బాధలను అనుభవించిన తరువాతే వారు ఈ స్టేజ్ కు రాగలిగారు.

25
తాగుబోతు పాత్రలో పాపులర్ అయిన రాజమౌళి..

జబర్దస్త్ లో చాలా ఏళ్లుగా కామెడీ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ రాజమౌళి. సినీ, టీవీ పరిశ్రమలో కూడా అడుగు పెట్టాడు ఈ కమెడియన్. జబర్దస్త్ కామెడీ షో ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి.. తాగుబోతు పాత్రలను అద్భుతంగా పండిస్తుంటాడు. మరీ ముఖ్యంగా మందుపై, మందుబాబులపై అతను పాడే పాటలు జబర్దస్త్ మొత్తానికి ప్రత్యేక ఆకర్శణగా నిలిచాయి. ఈ పేరడీ పాటలతో చేసిన స్కిట్స్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి. అందరిని నవ్వించే తాను.. జీవితంలో చూసిన అతి పెద్ద విషాదం గురించి రీసెంట్ గా వెల్లడించాడు రాజమౌళి.

35
కరోనా తో ఇబ్బందిపడ్డ జబర్దస్త్ రాజమౌళి..

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ రాజమౌళి తన జీవితం గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను షేర్ చేసుకున్నాడు. కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎమోషనల్ గా వెల్లడించాడు. రాజమౌళి మాట్లాడుతూ.." కరోనా వచ్చిన టైమ్ లో.. నేను నిజంగానే చనిపోతానని భయపడ్డాను. అప్పుడు పరిస్థితి అంత తీవ్రంగా ఉండేది. నాతో పాటు నా కుటుంబం కూడా కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులు చూసింది. అదే టైమ్ లో.. అదిరే అభి అన్నతో పాటు కొంతమంది జబర్దస్త్ టీమ్ సభ్యులు నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. నన్ను కాపాడారు'' అని రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు.

45
తిండి పెట్టి కాపాడిన మ్యూజిక్ డైరెక్టర్..

రాజమౌళి మాట్లాడుతూ.. '' కరోనా టైమ్ లో నన్ను నా కుటుంబాన్ని కాపాడిన వారిలో మ్యూజిక్ డైరెక్టర్ భోలే కూడా ఉన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా తమ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఎంతో సహాయం చేశారు. కరోనా టైమ్ లో నాకు షుగర్ లెవల్స్ బాగా పెరిగిపోయాయి.. దాంతో ఏది పడితే అది తినే పరిస్థితి లేదు.. అది తెలుసుకుని భోలే అన్న వాళ్ల అమ్మ గారు.. ఆయన భార్య ప్రత్యేకంగా నా కోసం వంట చేసి హాస్పిటల్‌కు తీసుకొచ్చేవారు. ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.. జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను '' అని రాజమౌళి అన్నాడు.

55
కుటుంబానికి ఏమైనా అవుతుందేమో అని భయపడ్డాను..

తాను మాత్రమే కాకుండా తన వల్ల తన అమ్మ, భార్య, పిల్లలకు, అన్న వారి కుటుంబానికి కూడా కరోనా సోకిందని రాజమౌళి అన్నాడు. తన భార్య ఎక్కడ చనిపోతుందో, పిల్లలకు ఏమవుతుందోనని చాలా బాధపడ్డానని, ఎవరు బతుకుతారో ఎవరు చనిపోతారో కూడా తెలియని పరిస్థితి అప్పట్లో ఉందని జబర్దస్త్ కమెడియన్ పేర్కొన్నాడు. ఆ రోజులు చాలా భయానకంగా గడిచాయని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని కోరుకుంటూ రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు.

Read more Photos on
click me!

Recommended Stories