పటాస్ షోతో కామెడీ జల్లులు కురిపించి.. తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కమెడీయన్ ప్రవీణ్. టపటపా చినుకులు పడ్డట్టు.. చక చకా తన పంచుల ప్రవాహంతో అలరిస్తుంటాడు ప్రవీణ్. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో సందడి చేస్తున్నాడు. జబర్థస్త్ లో ప్రస్తుతం ప్రవీణ్ - ఫైమా కాంబినేషన్ గుర్తుకు వస్తుంది హాస్య ప్రియులకు.