17 ఏళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నా...? కింగ్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాదంబరి కిరణ్

Published : Aug 18, 2022, 06:15 PM IST

కింగ్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరీ కిరణ్. దాదాపు 17 ఏళ్లుగా ఎదురుచూస్తుంటే అస్సలు పట్టించుకోవడంలేదంటూ.. వ్యాఖ్యానించారు. ఇంతకీ కింగ్ దేనిగురించి వెయిట్ చేపించారు.   

PREV
17
 17 ఏళ్ళుగా ఎదురుచూస్తూనే ఉన్నా...? కింగ్ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాదంబరి కిరణ్

నాగేశ్వ‌ర‌రావు త‌రువాత అక్కినేనివారి వారసుడిగా నాగార్జున ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నారు. తండ్రి మాదిరిగానే సినిమాల్లో  వ్యాపారల్లో రాణిస్తూ... పెద్దాయన పేరు నిలబెడుతున్నారు.  టాలీవుడ్ లో ప్రస్తుతం నలుగురు స్టార్ సీనియర్ హీరోలలో నాగ్ కూడా ఒకరు. ఇక ప్రస్తుతం ఆయన వారసులు కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.
 

27

ఇక నాగార్జున వారసులుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన నాగ‌చైత‌న్య, అఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగానే ఉన్నారు. నాగార్జున కూడా త‌న కొడుకుల‌కు గ‌ట్టి పోటీనే ఇస్తూ సినిమాల్లో న‌టిస్తున్నారు. 
 

37

ఇక ఇది ఇలా ఉండ‌గా.. నాగార్జున‌ గురించి ఫేమస్  క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కాదంబ‌రి కిర‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కింగ్ నాగార్జున త‌న సినిమా కథను వినడం కోసం ఏకంగా 17 ఏళ్లు వెయిట్ చేపించారన్నారు. ఇప్పటికీ తాను అనుకున్న కథను వినడానికి ఆయనకు తీరికలేకుండా పోయిందన్నారు. 

47

అది ఇంకా ఇప్ప‌టికీ  కొలిక్కి రాలేద‌ని చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి  ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను చెప్పారు. కాదంబరీ మాట్లాడుతూ.. కుర్రాళ్ల రాజ్యం  సినిమా త‌రువాత నాగ్ కు  ఒక కథ చెప్పాల‌ని ఆయ‌న ఇంటికి వెళ్లాను. నేను చెప్పే క‌థ విన‌డానికి నాగార్జున నాకు  ఏకంగా రెండున్న‌ర గంట‌ల టైమ్ ఇచ్చారన్నారు. 

57

అంతటి స్టార్ హీరో నాగార్జున నాకోసం అంత  స‌మ‌యం కేటాయించడంతో  నాకు ఆశ్చ‌ర్యం వేసింది అన్నారు కిరణ్. అంతే కాదు నేను చెప్పిన కథను ఆయన చాలా శ్రద్థగా విన్నారు.  చెప్పిన క‌థ‌లో రెండే రెండు  సీన్ల‌ను క‌రెక్ష‌న్ చేయాల‌ని తనకు  సూచించాడట.అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది అంటున్నారు కిరణ్. 
 

67

ఇప్పటికి ఆ కథ చెప్పి 17 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లు  గ‌డిచినా ఆ రెండు సీన్ల క‌రెక్ష‌న్ మాత్రం ఇప్ప‌టికీ ఆయ‌న విన‌డం లేదు. నాకు టైమ్ ఇవ్వడంలేదు. అయితే  అది నాగార్జున త‌ప్పు కాదు.. ఆయ‌న చాలా బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఆయ‌న‌ కథ వినడానికి టైమ్ దొరకటడంలేదు అన్నారు కాదంబరీ కిరణ్. 

77

కాదంబరీకిరణ్ కు అక్కినేని ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. నాగేశ్వరావుతో కూడా ఆయన చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆయనతో చివరి రోజుల్లో కూడా కిరణ్ ట్రావెల్ చేశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories