అందరి ముందు ప్రేమని ప్రపోజ్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్.. ఆనందం పట్టలేక ముద్దులతో ముంచెత్తిన బిగ్‌ బాస్‌ సుజాత

Published : Aug 11, 2022, 05:55 PM IST

`జబర్దస్త్`లో పుట్టిన ప్రేమ జోరుగా దూసుకుపోతుంది. కేవలం షోకే పరిమితం కాకుండా పర్సనల్‌ లైఫ్‌లోకి కూడా వెళ్లింది. అదే రాకింగ్‌ రాకేష్‌, జోర్దార్ సుజాతల లవ్‌ ట్రాక్‌. ఇప్పుడు వీరి ప్రేమ పీక్‌కి చేరింది.   

PREV
16
అందరి ముందు ప్రేమని ప్రపోజ్‌ చేసిన జబర్దస్త్ కమెడియన్.. ఆనందం పట్టలేక ముద్దులతో ముంచెత్తిన బిగ్‌ బాస్‌ సుజాత

`జబర్దస్త్` షో ప్రారంభం నుంచి తనదైన కామెడీతో మెప్పిస్తున్నాడు రాకింగ్‌ రాకేష్‌. తనదైన కామెడీతో మెప్పిస్తున్న ఆయనకు ఇటీవల కొత్త ఊపొచ్చింది. టీవీ యాంకర్‌, బిగ్‌ బాస్‌ 4 ఫేమ్‌ సుజాత రావడంతో తన జీవితమే మారిపోయింది. ఆయనకు జబర్దస్త్ లో జోడీ దొరికింది. షోకోసం ఏర్పడ్డ జోడి నెమ్మదిగా వ్యక్తిగతంగానూ దగ్గరయ్యే దాకా వెళ్లింది. షోలోనే నిర్మొహమాటంగా ప్రపోజ్‌ చేసుకునే స్థాయికి చేరుకుంది. 

26

`జబర్దస్త్`లో చాలా సందర్భాల్లో వీరిద్దరు ప్రేమ పాఠాలు చెప్పుకున్నారు. మొదట వీరిది కూడా షో కోసం క్రియేట్‌ చేయబడ్డ లవ్‌ ట్రాకే అనుకున్నారు. రష్మి-సుధీర్‌లాగా, ఇమ్మాన్యుయెల్‌-వర్షలాగా లవ్‌ స్టోరీ నడిపిస్తూ, ఎమోషనల్‌ డైలాగులు చెబుతూ ఆడియెన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుకున్నారు. కానీ వీరిద్దరు షో తర్వాత కూడా కలుసుకుంటున్నారు. ఒకరి ఇంటి మరొకరు వెళ్లడం, గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం వరకు వెళ్లింది. దీంతో వీరి ప్రేమలో నమ్మకం ఏర్పడుతూ వస్తోంది. 
 

36

తాజాగా తమ ప్రేమని బహిర్గతం చేశారు. స్టేజ్‌పైనే ప్రపోజ్‌ చేసుకున్నారు. అందరి ముందు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ముద్దులతో, హగ్గులతో రెచ్చిపోయారు. ప్రస్తుతం ఆయా సన్నివేశాలతో కూడిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇదంతా స్పెషల్‌ ప్రోగ్రామ్‌ `శ్రావణ సందడి` ఈవెంట్‌ ప్రోమోలో చోటు చేసుకోవడం విశేషం. ఈటీవీలో ప్రత్యేకంగా ప్రసారం కాబోతున్న షో ఇది. 

46

ఇందులో అనసూయ, రవి యాంకర్లుగా చేస్తున్నారు. జబర్దస్త్, బిగ్‌ బాస్‌, టీవీ ఆర్టిస్టులు, సింగర్లు కలిసి చేస్తున్న షో ఇది. ఈ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు ప్రసారం కాబోతుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య పోటీగా సాగింది. ఎవరు గొప్ప అనేది, ఒకరి మధ్య ఒకరికి పోటీ ప్రధానంగా సాగింది. పంచ్‌లు, సెటైర్లు ఆద్యంతం నవ్వులు పూయించారు. 

56

ఇక చివర్లో రాకింగ్‌ రాకేష్‌, సుజాత ఎపిసోడ్‌ వచ్చింది. ఇందులో అందరి ముందే తన లవ్‌ని ప్రపోజ్‌ చేశారు రాకేష్‌. దీంతో సుజాత సిగ్గులతో ముగ్గేసింది. ముసి ముసి నవ్వులతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇందులో రాకింగ్‌ రాకేష్‌ చెబుతూ, ప్రమోషన్‌ కోసం పుట్టిన ప్రేమ కాదు మాది, షో కోసం షో చేసే ప్రేమ కాదు, జీవితాంతం కలిసుండే ప్రేమ అని అందరి ముందే ఓపెన్‌గా చెప్పారు. 

66

రాకేష్‌ ప్రపోజల్‌కి ఫిదా అయిన సుజాత ఆనందం తట్టుకోలేకపోయింది. గట్టిగా హగ్‌ చేసుకుంది. అంతటితో ఆగలేదు రాకేష్‌ నుదుటిపై ముద్దులతో ముంచెత్తింది. మరోసారి ఆయన్ని హగ్‌ చేసుకుని అలానే ఉండిపోయింది. దీంతో రాకేష్‌ సైతం సుజాత హగ్‌తో పరశించిపోతూ ఆశ్చర్యానికి, షాక్‌కి గురవుతూ కనిపించారు. వీరి సన్నివేశాలు ప్రోమోలోనే హైలైట్‌గా నిలివడం విశేషం. మరి వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్తుందా? లేదా అనేది చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories