స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. చాలా రోజుల తర్వాత ఆసక్తికరంగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం బుట్టబొమ్మ పోస్ట్ హాట్ టాపిక్ గ్గా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించింది.
26
ఈ ముద్దుగుమ్మకు కొంత కాలంగా సినిమాల ఫలితాలు కలిసి రావడం లేదు. దీంతో ఆఫర్లు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. క్రేజ్ తగ్గుతుండటంతో చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా జారిపోయాయి.
36
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించాల్సిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) చిత్రం నుంచి బుట్టబొమ్మ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.
46
అయితే తాజాగా పూజా హెగ్దే పంచుకున్న కొన్ని ఫొటోలకు ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ శారీలో మెరిసిన ఈ మద్దుగుమ్మ అందంతో కట్టిపడేసింది.
56
అలాగే తన లేటెస్ట్ లుక్ కు ఇచ్చిన క్యాప్షన్ తో అందరినీ ఆలోచనలో పడేలా చేసింది. ‘పొట్లంకట్టిన బిర్యానీకి, బొట్టు బిళ్ల పెట్టినట్టు’ అనే లిరిక్స్ ను రాసుకొచ్చింది. ‘అలా వైకుంఠపురం‘లోని సాంగ్ ను గుర్తు చేసుకుంది.
66
అయితే అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇలాంటి కాప్షన్ ఇచ్చి వారిద్దరికి తనను గుర్తు చేసుకుంటుందా? అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.