తాజాగా ఈ ప్రత్యేకమైన ప్రొగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను టీమ్ విడుదల చేసింది. ఈవెంట్ కు నటుడు నరేశ్ (Naresh), పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) స్పెషల్ గెస్ట్ లుగా హాజరయ్యారు. బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. హైపర్ ఆది, తదితర కమెడియన్స్ పాల్గొని షోలో నవ్వులు పూయించే ప్రయత్నం చేశారు.