నటి ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) పేదేళ్లుగా బాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటోంది. 2013 నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. నటిగా కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు స్పెషల్ అపియరెన్స్ లతోనూ ఆకట్టుకుంటోంది. ‘సింగ్ సాబ్ ది గ్రేట్’, ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘పాగల్ పంథి’ వంటి చిత్రాల్తో అలరించింది.