యాంకర్‌ రష్మి నిజస్వరూపం చూసి షాకైన జబర్దస్త్ కమెడియన్‌.. హాట్‌ యాంకర్ ఇంత పనిచేసిందేంటి?

First Published Sep 14, 2022, 5:43 PM IST

జబర్దస్త్ యాంకర్‌ రష్మి ఈ షోకి ఎంతగా అసెట్‌ అవుతుందో అందరికి తెలిసిందే. ఆమె ఇప్పుడు రెండు జబర్దస్త్ లను లీడ్‌ చేస్తూ బిజీగా ఉంది. కానీ ఆమె నిజ స్వరూపం చూసి జబర్దస్త్‌ కమెడియన్‌ షాకవ్వడం విశేషం.
 

హీరోయిన్లు, సెలబ్రిటీలు మేకప్ లో ఒకలా, మేకప్‌ లేకుండా మరోలా ఉంటారు. మేకప్‌ లేకుండా చూడటం కొందరిని షాక్‌ అవుతుంటారు. అదే సమయంలో తెరపై చూసిన వారిని రియల్‌గా చూస్తే మైండ్‌ బ్లాక్‌ అవుతుంది. అంత భయంకరంగా ఉంటారని అంటున్నారు. 

తాజాగా హాట్‌ యాంకర్‌ రష్మి విషయంలో అదే జరిగింది. ఈ బ్యూటీని ని డైరెక్ట్‌ గా చూసిన ఓ కమెడియన్‌ షాక్‌ అయి మతి భ్రమించినట్టు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇదే సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో బుల్లెట్‌ భాస్కర్‌ స్కిట్‌లో రోహిణి, వర్షలతోపాటు ఇమ్మాన్యుయెల్‌ కూడా ఉన్నారు. వాళ్లమ్మ(రోహిణి)ని అమెరికా వెళ్దావమ్మా అని అడుగుతాడు భాస్కర్. కానీ ఆమె నేను హైదరాబాద్‌ చూశాకే అమెరికా వస్తానంటూ పట్టుకుని కూర్చొంటుంది. దీంతో భాస్కర్‌ ఫ్యామిలీ హైదరాబాద్‌ వచ్చింది. 
 

అక్కడ జబర్దస్త్ సెట్ కి వెళ్లగా, అసిస్టెంట్‌గా ఉన్న ఇమ్మాన్యుయెల్‌ జబర్దస్త్ సెట్‌ని చూపించి, భాస్కర్‌ వాళ్లమ్మకి అదిగో రష్మి రష్మి అంటూ ఆమె వద్దకి తీసుకెళ్తారు. భాస్కర్‌ వాళ్లమ్మ మరీ ఎగ్జైట్‌మెంట్‌లో రష్మి దగ్గరికెళ్లి ఆమె నిజ స్వరూపాన్ని చూసింది. అంతే వాయమ్మో అంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. సృహకోల్పోయినంత పని చేసింది. 

ఇది చూసిన ఇమ్మాన్యుయెల్‌ స్పందిస్తూ, మీకు ముందే చెప్పాను, హార్ట్ ఎటాక్‌ పెట్టుకుని భయంకరమైనవి చూడకూడదని అంటూ రష్మిపై పంచ్‌లు వేశారు.  దీనికి రష్మి కొంటెగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌ హైలైట్‌గా నిలవగా, ఈ సీన్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది. రష్మిని దగ్గరగా చూస్తే భయంకరంగా ఉంటుందని, ఆమె నిజ స్వరూపం చూస్తే ఎవరూ తట్టుకోలేరనే ఇమ్మాన్యుయెల్‌ చెప్పిన విధానం హైలైట్‌ అవుతూ నవ్వులు పూయించింది. 
 

ఈ స్కిట్‌ ఆద్యంతం కామెడీని పంచింది. `ఎక్స్ ట్రా జబర్దస్త్`లోని ఈ ప్రోమో తాజాగా విడుదల కాగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. పూర్తి ఎపిసోడ్‌ శుక్రవారం ప్రసారం కానుంది. ఇందులో మరిన్ని నవ్వులు చూడొచ్చు. ఈ ప్రోమోలో ఖుష్బు లవ్‌ స్టోరీ, కెవ్వు కార్తిక్ పై ఇంద్రజ సీరియస్ కావడం ఆకట్టుకుంటుంది. 
 

click me!