ప్రమాదంలో ప్రభాస్ రూ. 500 కోట్ల 'ప్రాజెక్ట్ కె'... సేమ్ స్టోరీతో హిట్ కొట్టిన ప్లాప్ హీరో?

First Published Sep 14, 2022, 5:18 PM IST


టాలీవుడ్ లో ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. దాని ప్రకారం ప్రభాస్ ప్రాజెక్ట్ కె ప్రమాదంలో పడింది అంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ మూవీ స్టోరీ లైన్ తో ప్రాజెక్ట్ కె కి పోలికలు ఉన్నాయట. 
 

Prabhas

ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కిస్తున్నాడు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరణ జరిపారు.


ఇండియాలో ఇంతవరకు రూపొందించని విజువల్ వండర్ గా ప్రాజెక్ట్ కె ఉంటుందట. దర్శకుడు నాగ అశ్విన్ ప్రాజెక్ట్ కె పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ అని స్వయంగా ప్రకటించారు. దర్శకుడి ప్రకటన సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది. 
 

క్యాస్ట్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. బాలీవుడ్ టాప్ స్టార్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య ఈ మూవీలో ఉపయోగించే కార్లకు సంబంధించి తమ ఇంజినీర్ల సహాయం కావాలంటూ... దర్శకుడు నాగ్ అశ్విన్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను అడిగారు. 
 


నాగ అశ్విన్ రిక్వెస్ట్ కి ఆనంద్ మహీంద్రా సానుకూలంగా స్పందించారు. అవసరమైన సాంకేతికత అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ప్రాజెక్ట్ కె ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు. 

ఐతే ఈ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఒకే ఒక జీవితం స్టోరీ లైన్ ప్రాజెక్ట్ కె కి దగ్గరగా ఉంటుందట. ఒకే ఒక జీవితం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. అమ్మ కోసం హీరో టైం మెషిన్ లో కాలంలో వెనక్కి వెళతాడు. స్కిన్స్ ఫిక్షన్ కథకు అమ్మ సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన ఒకే ఒక జీవితం మంచి విజయాన్ని అందుకుంది. 


కాగా ప్రాజెక్ట్ కె స్టోరీ లైన్ కూడా దాదాపు ఇలానే ఉంటుందట. ఈ చిత్రం సైతం టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారట. నిజంగా ఈ రెండు చిత్రాల కథలు సిమిలర్ అయితే ప్రాజెక్ట్ కె నష్టపోవడం ఖాయం. రెండు చిత్రాల కథలు దగ్గరగా ఉంటే ప్రేక్షకులు ఆ థ్రిల్ మిస్ అవుతారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి విజువల్స్ అబ్బురపరిచినా స్టోరీ పరంగా ప్రేక్షకులు పెదవి విరిచే ప్రమాదం ఉంటుంది. 
 


టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్త వణుకు పుట్టిస్తుంది. వందల కోట్ల ప్రాజెక్ట్ కావడంతో అదే నిజమైతే దర్శక నిర్మాతల పరిస్థితి ఏమిటీ? అంటున్నారు. ఆచార్య మూవీ ఈ కారణంతోనే డిజాస్టర్ అయ్యింది. అఖండ స్టోరీ లైన్ కి దగ్గరగా ఉన్న ఆచార్య డిజాస్టర్ అయ్యింది. అఖండ మూవీ చూశాక ఆచార్య మేకింగ్ కొరటాలకు కష్టమైపోయింది. 

click me!